Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-36

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

 

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. కువలయపీడనమనే ఏనుగును బాలరామకృష్ణులపైకి పంపి, కృష్ణుని చేతిలో మరణించిన కంసుడి సేవకుడు ఎవరు?
  2. మహాభారతం ప్రకారం వ్యాసుని ద్వారా అంబాలికకు, అంబికకు ఎవరు జన్మించారు?
  3. పురాణ నామ చంద్రిక ప్రకారం, విప్రచిత్తి, సింహికల కొడుకు పేరు?
  4. ఉత్తర రామాయణం ప్రకారం, రావణుడి వెయ్యేళ్ళ తపస్సుకు మెచ్చి శివుడు రావణుడికి ఇచ్చిన ఖడ్గం పేరు?
  5. కథాసరిత్సాగరం ప్రకారం, బ్రతికి ఉన్న నాగులని తినడం ఆపమని గరుత్మంతుని కోరినవాడెవరు? (క్లూ: ఇతను జీమూతకేతువు కుమారుడు)
  6. కుబేరుని శాపం వల్ల విరాధుడనే రాక్షసుడిగా పుట్టి, రాముడి చేతిలో మరణించిన దేవగంధర్వుడు ఎవరు?
  7. భృగువు భార్యని అపహరించి, ఆయన ద్వారా కీటకంలా మారే శాపం పొందిన రాక్షుసుడు, పరశురాముడు కర్ణుని తొడపై నిద్రిస్తున్నప్పుడు, కర్ణుని కరిచిన కీటకం పేరు?
  8. శివపురాణం ప్రకారం, శివుడు వధించిన రాక్షసరాజు, బృంద భర్త ఎవరు?
  9. భారతం ప్రకారం, బ్రహ్మకు శివసహస్రనామాలు చెప్పిన ఋషి ఎవరు?
  10. కంసుడి ఆదేశాల ప్రకారం అశ్వరూపంలో కృష్ణుని చంపడానికి వెళ్ళి, కృష్ణుడి చేతిలో చనిపోయిన రాక్షసుడు ఎవరు? (క్లూ: ఇతని వలనే కృష్ణునికి కేశవుడనే పేరు వచ్చింది)

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 డిసెంబర్ 02తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-36 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 డిసెంబర్ 07వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 34 జవాబులు:

1) ధీమంతుడు 2) ధన్వంతరి 3) నలకూబరుడు 4) పాంచజన్యుడు 5) పుండరీకుడు 6) భరద్వాజుడు 7) మణిమంతం 8) మహిష్మానుడు 9) మూర్తి 10) మృతసంజీవని 11) యక్ష్మ/రాజయక్ష్మం

పురాణ విజ్ఞాన ప్రహేళిక 34 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version