[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- విష్ణుపురాణం ప్రకారం, బ్రహ్మ హృదయం నుంచి జన్మించినదెవరు?
- శివపురాణం ప్రకారం, మహిషాసురిడి కొడుకు, శివునికి కృత్తివాసుడైన రాక్షసుడెవరు?
- బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి, అప్సర స్త్రీ అయిన ఘృతాచి, విశ్వకర్మ పరస్పరం శపించుకుని భూలోకంలో పుట్టి ఎవరి జన్మలకు కారణమయ్యారు?
- భారతాన్ని అనుసరించి – మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠుడు సప్తర్షులు. వీరి సమూహ నామం ఏది?
- భాగవరం ప్రకారం, కంసుడి ఆదేశాల మేరకు కృష్ణుడిని చంపేందుకు సుడిగాలిలా వచ్చి, కృష్ణుడిని పైకెగరగొట్టి, తరువాత కృష్ణుని చేతిలో చనిపోయినదెవరు?
- వామన పురాణం ప్రకారం కాశీక్షేత్రం మొదట ప్రయాగ. తరువాత వారణాసి. తరువాత కాశిగా మారింది. ఏ రెండు నదుల మధ్య ప్రదేశం కాబట్టి వారణాసి అయింది?
- దేవీ భాగవతం ప్రకారం, ఈ రుషి – ప్రమద్వరను వివాహం చేసుకుందామనుకుంటాడు. ఈ లోపు ఆమె పాము కాటుకు గురై మరణించగా తన ఆయుష్షులో సగభాగం ఇచ్చి బ్రతికిస్తాడు. ఎవరితడు?
- భారతం ప్రకారం, భీముడు బకాసురుడిని సంహరించిన అరణ్యం పేరు?
- భాగవతం ప్రకారం సత్యవతి పరాశరుల పుత్రుడు, మహాభారత కర్త ఎవరు?
- బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, గోలోకంలో విరజ, శ్రీకృష్ణులకు ఏడుగురు కొడుకులు పుడతారు. వారిలో ఒకడు ఏడుస్తుంటే, వాణ్ణి సముదాయించేందుకు విరజ వెళ్ళగా కృష్ణుడు మాయమవుతాడు. కృష్ణుని ఎడబాటుకు దుఃఖించి, ఈ విరహానికి పిల్లలే కారణమని భావించి, వాళ్ళని శపిస్తుంది. ఆ పిల్లలెవరు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 డిసెంబర్ 09వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-37 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 డిసెంబర్ 14వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 35 జవాబులు:
1.గోవింద భగవత్పాదాచార్యులు 2. దండపాణి 3. మకరధ్వజుడు 4. రంతిదేవుడు 5. వసుదేవుడు 6. సుదేవ 7. హూహూ 8. అశ్వనది 9. అశ్వుడు 10. జైత్రం
పురాణ విజ్ఞాన ప్రహేళిక 35 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
