[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- భారతాన్ని అనుసరించి – విదురుని వలె, శూద్ర స్త్రీకి, బ్రాహ్మణునికి పుట్టినవారిని ఏమని పిలుస్తారు?
- వాల్మీకి రామాయణం ప్రకారం, ఏ నదిలో శ్రీరాముడు తన శరీరాన్ని త్యజించాడు?
- భాగవతం ప్రకారం, బ్రహ్మకూ సరస్వతికి పుట్టిన మొదటి మనువు ఎవరు?
- బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, శంఖుచూడుడి ఎముకల నుంచి పుట్టినవి ఏవి?
- భారతం ప్రకారం, భీమసేనుని భార్య, ఘటోత్కచుని తల్లి అయిన హిడింబిని ఇలా….. అంటారు?
- భారతాన్ని అనుసరించి సత్యవంతుని తండ్రి, సావిత్రి మామగారైన అంధుడైన రాజు ఎవరు?
- కథాసరిత్సాగరం ప్రకారం, చంద్రవంశానికి చెందిన రాజు విష్ణుమతి, శతానీకుల కుమారుడెవరు?
- భాగవతాన్ని అనుసరించి, ఇలా, బుధుల కొడుకైన చంద్రవంశపు రాజెవరు?
- రామాయణం ప్రకారం రామలక్ష్మణులు సుగ్రీవుడిని మొదటిసారి కలిసిన ఏ పర్వతం మీద కలిశారు?
- శివపురాణం ప్రకారం దితికశ్యపుల కుమారుడు, తారకాసురుడి తండ్రి పేరేమిటి?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 డిసెంబర్ 16వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-38 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 డిసెంబర్ 21వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 36 జవాబులు:
1) అంబష్టుడు 2) పాండురాజు, ధ్రుతరాష్ట్రుడు 3) కేతువు 4) చంద్రహాసం 5) జీమూతవాహనుడు 6) తుంబురుడు 7) అలర్కం 8) జలంధరుడు 9) తండి 10) కేశి
పురాణ విజ్ఞాన ప్రహేళిక 36 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- సునీతా ప్రకాష్, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
