Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పురాణ విజ్ఞాన ప్రహేళిక-39

[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]

భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.

అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.

~

ప్రశ్నలు:

  1. భాగవతం ప్రకారం, కంసుని ఆదేశాలతో సర్పరూపంలో కృష్ణుని చంపడానికి వెళ్ళి, కృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడు ఎవరు? (క్లూ: ఇతడు పూతన, బకాసురుల సోదరుడు)
  2. భారతం ప్రకారం, దేవలుడి సోదరుడు నివసించిన పుణ్యస్థలం, దౌమ్యుడిని తమ పురోహితునిగా చేసుకున్న స్థలం ఏది?
  3. భారతం ప్రకారం, కశ్యపుడి భార్య, ధరణీదక్షుల కుమార్తె, ఘృతాచీ మేనకల తల్లి ఎవరు?
  4. శృంగేరీ, జగన్నాథ, ద్వారక, బదరీనాథ పీఠాలను స్థాపించినదెవరు?
  5. భారతం ప్రకారం, ధర్మరాజుకన్నా ముందు, రాజసూయ యాగం నిర్వహించినదెవరు?
  6. అగ్నిపురాణం ప్రకారం, విష్ణువు, విష్ణుయశుడి పేరుతో, శంబళాపురంలో సుమతికి పుత్రుడిగా ఏ అవతారంలో జన్మిస్తాడు?
  7. క్రౌంచ, వామన, అంధకార, మైనాక, గోవింద, నిబిడ, నిష్కింభ పర్వతాలను కలిగి వున్న సప్తద్వీపాలలోని ఒక ద్వీపం ఏది?
  8. భాగవతం ప్రకారం, చారుగుప్తుడు, చారుచంద్రుడు, చారుదేహుడు, చారుభద్రుడు, చారువు, చారువేశుడు, చారుశ్రవసుడుల తల్లిదండ్రులు ఎవరు?
  9. భారతాన్ని అనుసరించి, ఇంద్రుడు పంపిన ఓ అప్సరస వల్ల శరద్వంతుడికి తపోభంగమై, రేతఃపతనం జరిగి కృపుడు, కృపి పుడతారు. ఆ అప్సరస ఎవరు?
  10. కథాసరిత్సాగరం ప్రకారం, గుణాఢ్యుడి బృహత్కథలోని ఒక పాత్ర అయిన రాజు భార్య శక్తిమతి పాటు కాటువల్ల మరణిస్తుంది. రాజు బ్రహ్మచర్యం అవలంబించి ఉండగా, శివుడు కలలో కనబడి – రాజు వేటకు వెళ్ళినప్పుడు, అడవిలో సింహం మీద ఒక బాలుడు కనిపిస్తాడని, ఆ పిల్లాడిని కొడుకుగా స్వీకరించమని చెప్తాడు. అడవిలో దొరికిన బిడ్డకి శాతవాహనుడిగా పేరు పెట్టిన రాజు ఎవరు?

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 డిసెంబర్ 23తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-39 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2025 డిసెంబర్ 28వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పురాణ విజ్ఞాన ప్రహేళిక 37 జవాబులు:

1.క్షత్రియులు 2. గజాసురుడు 3. కంసాలి, వడ్రంగి 4. చిత్ర శిఖండి 5. తృణావర్తుడు 6. వరణ, అసి 7. రురుడు 8. వేత్రకీయ వనం 9. వేదవ్యాసుడు 10. సప్త సముద్రాలు

పురాణ విజ్ఞాన ప్రహేళిక 37 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
  2. ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version