[శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్‌ని పాఠకులకు అందిస్తున్నాము.]
భారతీయ పురాణాలు విజ్ఞాన గనులు. చదువుతున్న కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పురాణేతిహాసాల గాథలన్నీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, పండితుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా మనలో చాలామందిమి వినే ఉంటాము. మనలో కొందరు రామాయణ, భారత భాగవతాది గ్రంథాలను నిత్య పారాయణం చేస్తూనే ఉంటారు. వీటిలోని విశేషాలను మరల మరల మననం చేసుకున్నా వాటి ఆస్వాదనా గుణం తగ్గుముఖం పట్టదు.
అందుకే, భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై పాఠకులకున్న అవగాహననీ, విజ్ఞానాన్ని మరోసారి వెలికితెచ్చేలా, సంచికలో, శ్రీనివాసరావు సొంసాళె గారు ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక’ అనే ఫీచర్ నిర్వహిస్తున్నారు. ఇది వారం వారం కొనసాగుతుంది.
~
ప్రశ్నలు:
- అగ్ని/విష్ణుపురాణం ప్రకారం అధర్ముడి భార్య హింసకు అనృతుడు, నికృతి అనే కొడుకు కూతురు పుడతారు. వారిద్దరికీ భయ, నరక అనే కొడుకులు, మాయా, వేదన అనే కూతుర్లు జన్మిస్తారు. మాయకి భయ వల్ల మృత్యువు జన్మించగా, వేదనకి నరక వల్ల పుట్టినది ఎవరు?
- వాల్మీకి రామాయణం ప్రకారం – తామ్ర, కశ్యపుల కూతురు నుండే హంసలు, ఎర్రబాతులు ఉద్భవించాయి. ఆమె ఎవరు?
- సునీత ఉత్తానపాదుల కుమారుడైన ఈతడు 26 వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి, విష్ణువు వరంచే కల్పాంతం వరకు నక్షత్రంలా ప్రకాశిస్తున్నవాడు ఎవరు?
- భారతం ప్రకారం ఇద్దరు మునులు బదర్యాశ్రమంలో వేల సంవత్సరాలు తపస్సు చేసి అర్జునుడు, శ్రీకృష్ణుడిగా జన్మించారు. వారెవరు?
- కంబ రామాయణం ప్రకారం, వెయ్యి తలలు, రెండు వేల చేతులున్న రాక్షసరాజు, శతముఖ రావణుడిని జయించి, అతని ఏకైక కుమార్తె ఇందుమతిని వివాహమాడాడు. లక్ష్మీదేవి వల్ల మరణం పొందేట్టు శాపానికి గురైన ఈ రాక్షసుడెవరు?
- వాయుపురాణం ప్రకారం, బృహస్పతి శుభల కుమార్తె – తన భర్త కర్దముడిని వదిలి, చంద్రునితో ఉంది. ఆమె పేరు?
- 13, 14వ శతాద్బాలకు చెందిన వేదాంతి ఈయన. ద్వైత మత స్థాపకుడు. శంకరాచార్యుని అద్వైతాన్ని తీవ్రంగా నిరసించినవాడు, ఉడిపి దగ్గర పాచక క్షేత్రంలో జన్మించాడు. ఈయన ఎవరు?
- రామాయణం ప్రకారం – యుద్ధంలో రావణుడిపై రాముడే జయిస్తాడని కలగన్న, రావణుడి అంతఃపుర కన్య ఎవరు?
- భారతం ప్రకారం, అశ్వత్థామ, కృప, సాత్యకులని ఏమని పిలుస్తారు?
- హరిశ్చంద్ర, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్జార్జునుడు – వీళ్ళని ఏమని పిలుస్తారు?
~
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 డిసెంబర్ 30వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పురాణ విజ్ఞాన ప్రహేళిక-40 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జనవరి 04వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పురాణ విజ్ఞాన ప్రహేళిక 38 జవాబులు:
1) పారశవుడు 2) సరయూ నది 3) స్వాయంభువు 4) శంఖాలు 5) సాలకటంకటి 6) ద్యుమత్సేనుడు 7) సహస్రానీకుడు 8) పురూరవుడు 9) ఋష్యమూకం 10) వజ్రాంగుడు
పురాణ విజ్ఞాన ప్రహేళిక 38 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామలింగయ్య టి, తెనాలి
- శ్రేయా ఎస్. క్షీరసాగర్, దావణగెరె
- రామవరపు గిరిజాశంకర రావు, పూణే
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
వీరికి అభినందనలు.
గమనిక:
- పురాణ విజ్ఞాన ప్రహేళికలో ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణిస్తాము.
- ఈ క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
గమనిక:
ఈ ఫీచర్ ఈ ఎపిసోడ్‌తో ముగుస్తోంది. వచ్చే రెండు వారాలు, 39, 40 ప్రహేళిక జవాబులు, సరిగ్గా సమాధానాలు వ్రాసినవారి పేర్లు మాత్రమే వెలువడతాయి. – సంపాదకులు.
