Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రేడియో

[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘రేడియో’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

రేడియో తను కలలోనైనా
ఊహించి ఉండదు

వీడియోల్లో తను కనిపిస్తానని
తన వీడియోలను వీక్షిస్తారని

తనకూ రివ్యూలు వస్తాయని
వాటిపై కామెంట్లు రాస్తారని

ఆడియో సాధనానికి వీడియో
ప్రచారం ఓ సంభ్రమాశ్చర్యం

రెండింటి అనుసంధానం
ఊహకు అందని వైవిధ్యం

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ
సాధనాల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ

గమ్యానికి చేరుస్తున్న ఆడియో,
వీడియో, రీల్స్‌ల సోషల్ మీడియా

Exit mobile version