[శ్రీ రేడియమ్ రచించిన ‘ముక్తిదాయిని’, ‘ధృతరాష్ట్రీయం’ అనే రెండు చిన్న కవితలని అందిస్తున్నాము.]
1. ముక్తిదాయిని
~
చలన నైజం
విజ్ఞాన కల్పవృక్షం
గ్రంథ కుటీరం..
జీవన వర్తిని
సర్వమానవ
కాంతి వాహిని
అక్షరజ్యోతి
అక్షరాంజలి
వివేకాంజలి
2. ధృతరాష్ట్రీయం
~
మురికి పీడ
ఆక్రమణల నీడ
నాలాల గోడు
పట్టదు నేడు
