[శ్రీ రేడియమ్ రచించిన ‘జలహృదయం’, ‘జోకర్’ అనే రెండు చిన్న కవితలని అందిస్తున్నాము.]
1. జలహృదయం
~
చల్లని నీరు
అతిచల్లని నీరు
వినయం
అతివినయం
నీటి వినయం
నీటివినియోగం
ఆరోగ్యం
అనారోగ్యం
సలక్షణం
కులక్షణం
2. జోకర్
~
ఓటుకు నోటు
ఓటుకు నాటుసారా
పంచితే లీడర్
లేకుంటే జోకర్
