[శ్రీ భళ్ళముడి వెంకట నాగేశ్వర రావు రచించిన ‘రహస్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీవద్ద ఉంటేనే అది రహస్యం
ఎదుటివాడివద్దకు చేరిందా
అది వాడికి ఆయుధం
నీ బలహీనత తెలిసినవాడు
ఎప్పుడైనా నిన్ను ఓడించగలడు.
నవ్వుతూ వినే చెవులన్నీ
నీ మంచి కోరేవి కావు.
ఈరోజు నీ బాధ విన్న గొంతు
రేపు ఊరంతా చాటించొచ్చు.
నీ రహస్యాలు కాపాడుకో
లేకపోతే
రేపు అవే నిన్ను కాటేస్తాయి
