నవంబర్ 13వ తేదీన విడుదలయ్యే రామకథసుధ కథల సంకలనంలో ప్రచురణకు ఎంపికయిన కథల జాబితా.. పుస్తకంలో ఇదే వరుసలో కథలు ప్రచురితమవుతాయి.
సంకలనంలో ప్రచురణకు ఎంపికయిన వారందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఇంకా, రాముడు, రామాయణానికి సంబంధించి అనేక అత్యద్భుతమయిన కథలున్నా, అన్నీ మా దృష్టికి రాకపోయి వుండవచ్చు. వచ్చినా మేము అనుకున్న ప్రామాణికాలలో వొదగకపోయి వుండవచ్చు. అంతే తప్ప, కథలలో లోపం వుందని అనుకోకూడదు. కేవలం మేము అనుకున్న ప్రామాణికాలలో వొదగక పోవటంవల్లనే ఎంచుకోలేదు తప్ప కథల్లో నాణ్యతా లోపంవల్ల కాదు!! మేము అనుకున్న ప్రామాణికాలు పుస్తకానికి ముందుమాటలో వివరించాము.
విషయసూచిక
రామాయణ ఆధారిత కథలు
- శ్రీరాముని చింతన————— యల్లాప్రగడ సంధ్య
- సీతాకళ్యాణం——————— ముళ్ళపూడి వేంకటరమణ
- సీత పాదాభివందనం———— చుండూరు జనార్ధన గుప్త
- ఊర్మిళ—————————- సింగరాజు నాగలక్ష్మి
- మాండవి————————– ఎమ్. లక్ష్మీ దేవి
- లక్షణగడ్డ————————– ఎల్లోరా
- రేగుపళ్ళ రుచి——————— నారాయణ శర్మ
- భ్రాతృప్రేమ———————- గోనుగుంట మురళీకృష్ణ
- కౌగిలి——————————- సీహెచ్ బృందావనరావు
- విభీషణుని భక్తి—————– మద్దుల లక్ష్మీనారాయణ గుప్త
- లోహజంగుడు—————— బలభద్రపాత్రుని రమణి
- సీత చెప్పిన సత్యం———- భమిడిపాటి గౌరీ శంకర్
- ప్రేమాగ్ని పరీక్ష—————- కస్తూరి మురళీకృష్ణ.
- కరుణించవా శివా!!———— శ్రీనివాస దీక్షితులు
- న్యాసము———————- – కుంతి
- రామరాజ్యం——————— శింగంపల్లి అప్పారావు
- హనుమంతుని స్వప్నం———-. పరశురాం
- ఘటన—————————— జె. శ్యామల
- రామాయణంలో రజని—— డా!! లత
సామాజిక రామాయణం
- వందే దశరధాత్మజం—————- ఆవుల వేంకట రమణ
- ఒక కథ——————————- పానుగంటి లక్ష్మీ నరసింహం.
- ఔనౌను——————————- మల్లాది రామకృష్ణ శాస్త్రి
- వారాదిరాముడు———————- నంద్యాల సుధామణి
- రామమాడ————————— పీవీ ప్రభాకరమూర్తి
- రామలీల—————————- టెంపోరావు
- యతోధర్మస్తతోజయః————— పాణ్యం దత్త శర్మ
- రాముడు కట్టిన వంతెన———— వాడ్రేవు చినవీరభద్రుడు.
- రామకథాసుధ———————– వేదాంతం శ్రీపతిశర్మ
సంపాదకులు
కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్, కొల్లూరి సోమ శంకర్
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

