మిస్ మార్గరెట్ నోబుల్ – సోదరి నివేదితగా మారిన వైనాన్ని వివరించే చిన్న పుస్తకం ఇది. వేళ మైళ్ళ దూరం వచ్చి, భారతీయులను సొంతవారిలా మార్చుకుని దేశానికే తన జీవితాన్ని అంకితం చేసి ఈ మట్టిలోనే కలిసిపోయిన గొప్ప స్త్రీమూర్తి సంక్షిప్త జీవన గాథ ఈ పుస్తకం.
“మిస్ మార్గరెట్ నోబుల్ నుండి నివేదిత-ఎంతటి మార్పు! ఎంతటి సమగ్రపూర పరివర్తన! అది ప్రశ్న నుండి జవాబు దాకా ఆసక్తికరంగా సాగిన ఒక కష్టభూయిష్టమైన యాత్ర, పునరుత్థాన భారత్ కు భౌతిక పాశ్చాత్యం వేసిన ప్రశ్న ‘మిస్ నోబుల్’ అయితే, దానికి ఆధ్యాత్మిక ప్రాచ్యం ఇచ్చిన జవాబు “సోదరి నివేదిత”. నివేదిత పేరును ఒక మనిషి సాహసిక యాత్రకు ప్రతీక అనేకంటే ఒక చారిత్రిక ప్రక్రియకు, సామాజిక నడవడికి, భారతీయ పునర్వికాసానికి చిహ్నం అనడం సమంజసం. సత్యజీవనం గడిపేవారికి వీరోచితకృషి సలిపేవారికి అది అనుకరించదగిన అనుసరణీయ నమూనా. ఆ దృష్టితో, ఆ స్ఫూర్తితో ఈ మహోన్నత జీవిత చరిత్రను చదివి తెలుసుకొందాము” అన్నారు శ్రీ రంగా హరి – తాము వ్రాసిన ‘ప్రస్తావన’లో.
నవయుగ భారతి ప్రచురణల వారు ప్రచురించిన ఈ 64 పేజీల పుస్తకం వెల రూ.30/-. ప్రతులు సాహిత్యనికేటన్, 3-4-852, కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాద్ 500027 వద్ద, సాహిత్యనికేతన్, గవర్నర్‌పేట, ఏలూరు రోడ్, విజయవాడ 520002 వారి వద్ద లభిస్తాయి.