పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో 3/1/2025 న, సంస్కృత విశ్వ విద్యాలయం కౌన్సిల్ మీటింగ్ హాల్ లో ఉపకులపతి జి.ఎస్.ఆర్. కృష్ణ మూర్తి గారు, రచయిత ఆర్.ఎం.ఉమా మహేశ్వర రావు గార్ల సమక్షంలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారి రెండు బాలల అనువాద పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
ఆయన రచించిన రాజుగారి కథలు బాలల పుస్తకం ‘రాజన కథెగళు’ గాను, రాణి గారి కథలు ‘రాణియ కథెగళు’ పేరుతోను కన్నడంలోకి అనువదింపబడ్డాయి.
అనువాదకురాలు సూర్య వంశీ అనువదించగా, బెంగుళూరు విక్రం పబ్లికేషన్స్ వారు వీటిని ప్రచురించారు.
ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు రమాకాంత శర్మ, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, చంద్రమోహన్, హర్షవర్థన్ రెడ్డి, ప్రభాకర్ రాజు, తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.