Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రెండు కవితలు

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘రెండు కవితలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆ పేరు
ప్రవహిస్తున్నంత కాలం
కాగితం పడవలో
ఆమె ఊరెళ్ళి

ఒక నిజాన్ని
ఒక అబద్ధాన్ని
రెండు కవితలుగా వ్రాసి ఇస్తాను..

“నేను ప్రేమిస్తూనే ఉంటాను” అనే నిజాన్ని..
“ఆమె మరచిపోయింది” అనే అబద్ధాన్ని..

Exit mobile version