[శ్రీ రేడియమ్ రచించిన ‘రో’ అనే కవితని అందిస్తున్నాము.]
అప్పులు చేయకు మనిషీ
తిప్పలు పడకు మనిషీ
మతిచెడకను బలే
గొప్పగ బతకగ వచ్చును
అప్పులు నిప్పు వలె నిన్ను
అంతము చేయున్
వడ్డికి వడ్డి పెరిగి నీ
నడ్డిని విరుచ నడివీధి
నగుబాటవదా
గుడ్డిగ అప్పును నమ్మకు
గడ్డు సమయమున గడపుము
గంజిగటకతో!
