[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘సాకులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అన్ని కాలాల్లో సాకుల
ప్రవాహం నిర్విరామం
మార్పు అనివార్యమే అయినా
మారని మనుషుల తత్వం
కష్టించువాడు ఎరుగడు సాకులను
కడుసోమరి వదలడు సాకులను
నిలబడవు సాకులు ఒంటరిగా
నాయకులుందురు సాకులకు అండగా
తరతరాలుగా వాడుతున్న సాకులు
మారని సాకులతో మమేకమైన మనసులు
అనుక్షణం మారుతున్న విశ్వం
కానీ సాకులతో జీవించే జనుల నైజం
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్
