Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సగం కాదు జగం

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘సగం కాదు జగం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

డది అంటే అనుకరణ కాదు
అలంకరణ అసలే కాదు
వశీకరణ మంత్రంతో
వశం చేసుకోవాలని చూస్తే
మసి చేస్తుంది నుసి చేస్తుంది
ఏమీ కాకుండా చేస్తుంది
ఆమె కరుణిస్తే మాత్రం
శిశిరంలోనూ వసంతాలు పూయిస్తుంది
శశికైనా వెన్నెలలు అరువిస్తుంది
అమావాస్యకూ ఆశలు చిగురిస్తుంది
అందుకే ఆమె సగం కాదు జగం
తానొక నిలువెత్తు నిజం
ఆమె తోడుంటే విజయం
లేకుంటే సర్వం శూన్యం

Exit mobile version