Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సమాహారం

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘సమాహారం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మణి ముకురం
కళాయి రహితమైతే
నిజరూపం చూపలేదు
*
పెడసరం మాట
నొచ్చుకున్న మనస్సుని
ప్రేమతో స్పర్శించలేదు
*
చిమ్మ చీకటి
దివ్వె జ్వలించకుంటే
వెలుగును పొందలేదు
*
గడిచిన కాలం
చేజారిన క్షణాన్ని
తిరిగి ఇవ్వ లేదు

Exit mobile version