[డా. కొర్లగుంట సాయి ప్రసాద్ రచించిన ‘సనాతన ధర్మ దార్శనికులు’ అనే పద్య కవితని అందిస్తున్నాము.]
~
సీ.:
వ్యాథుండు వ్యధితుడై వేల శ్లోకాలతో
రామాయణంబెట్లు రచన చేసె;
అష్టాదశ పురాణ, ఐతిహాసమ్ముల
వ్యాసర్షి ఏరీతి వ్యక్తపరచె!
అద్వైత వ్యాప్తికై ఆసేతు హిమగిరి
అలయకెవ్విధి తిరిగె ఆదిగురువు;
షిరిది విడువని ఆ శ్రీ సాయి బాబాను
విశ్వమంతయు ఏల విశ్వసించె
కారణ జన్ములు, కర్మవీరులు వారు
ఆర్తత్రాతలు, విధాతసములు
పార్షదులవ్వారు పరమ భాగవతులు
నిత్యులు, అనునిత్య సత్యవ్రతులు
ఎప్పుడో, ఎక్కడో, ఎన్నేళ్లకొకసారొ
పుడతారు పుడమిపై పుణ్యజనులు;
సంఘసంస్కర్తలు, సంస్మరణీయులు
అవధూత రూపాన అవతరింత్రు
తే.గీ.:
వారి బోధనల్ ముక్తి సంస్ఫోరకములు,
వారి పదములు సద్బుద్ధి కారకములు,
వారి చేతలు సత్కర్మ ప్రేరకములు,
వారి సూక్తులు సత్పథ దర్శనములు,
వారి దర్శనం దైవ సంస్పర్శనములు.
