Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 102

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. కుమారస్వామి (3)
3. ఇరావంతుడి తల్లి (3)
5. అజ్ఞాతవాసకాలమున సైరంధ్రీవేషమును ధరియించిన ద్రౌపది ఉంచుకొనిన నామము (3)
6. పంపాతీరమునందలి మతంగాశ్రమమున ఉండిన రామభక్తురాలు అయిన ఒక బోయత అటునించి వస్తోంది (3)
7. గుడి (3)
10. సూర్యుడు (4)
11. శివుడు (4)
12. భూమి (3)
14. ఈయన కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఫిడేలు రాగాల డజన్ సృష్టికర్తగా ప్రసిద్ధుడు (3)
16. ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ ను రచించిన బండారు ధర్మారావు నాయుడుగారు ఇలా ప్రసిద్ధులు (3)
17. యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము, అటునించి (3)
18. ఏనుఁగుతొండపుమొన (పన్నెండు సంవత్సరాల కాలం) (3)

నిలువు:

1. ‘కృష్ణా పత్రిక’ సంపాదకులుగా తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసిన పాత్రికేయులుగారి ఇంటి పేరు(3)
2. 35వ మేళకర్త రాగం (3)
4. ఆడు మేక (3)
8. సంబరం (3)
9. ఆకులుగూడ భుజింపక అనేకవేల సంవత్సరములు రుద్రునికూర్చి తపము ఆచరించినందున ఈమెకు ఈపేరు కలిగెను. (3)
12. నిర్జల భూమి (3)
13. జ్యోతిష్య శాస్త్రమునకు సంబంధించి 360 దినముల పరిమితి గల సంవత్సరము (క్రిందిలోకము) (3)
15. వజ్రాయుధము (3)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఫిబ్రవరి 20 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 102 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 ఫిబ్రవరి 25 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 100 జవాబులు:

అడ్డం:   

1.భా 2. అమృతాప్రీతం 6. ర 7. సరిగ 8. తుహినం 10. సరో 11. యముడు 13. దిచి 15. త్యజితం 17. నవల 18. కనీసము 19. నిరర్ధక 20. ర్మునాత 22. మునమ 23. డు యు 24. ముముక్ష 26. పూర్తి 27. డునుఘ 29. మునులు 31. త 32. రామాలయము 33. ము

నిలువు:

2.అరి 3. మృగయ 4. ప్రీతుఁడు 5. తంహి 7. సరోజినీనాయుడు 9. నందివర్ధనపూలు 10. సత్యకర్ముడు 12. ముగ్ధ 14. చిలకమర్తి 16. తంసత 17. నరము 21. గోము 24. ముఘమా 25. క్షముయ 28. నురా 30. నుము

సంచిక – పద ప్రతిభ 100 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version