Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 121

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రమ్ము – త్రాగేది కాదండీ బాబూ – పిలిచేది (1)
2. 1976 లో SPB గారు పాడిన ఒక అద్భుతమైన పాట – చాలా పెద్ద హిట్ – ఈ రాగంలోనే స్వరపరిచారు – ఈ రాగం పేరుతోనే పాట మొదలయ్యేది కూడా – సంగీతం రమేష్ నాయుడు గారు.- ఆ తరువాత ఈ రాగం పేరుతోనే జయసుధగారి సినిమా కూడా వచ్చింది.(5)
6. పవర్గ పంచమాక్షరము – మధ్యమ స్వరము (1)
7. కందర్పస్యందనము (3)
8. మంత్రాల తోడివి, తడబడ్డాయి (3)
10. కీటకాదులను చంపునది. ఆకాశము (2)
11. ఆరు గావచ్చు, తొమ్మిది గావచ్చు – ఏక వచనంలో చెప్పండి – ముందర ఒక చరణం తగిలిస్తే ఒక లోహం కనిపిస్తుంది – గట్టిగా పెట్టుకోకపోతే జారిపోతుంది సుమండీ! (3)
13. అడవులలో నివసించు ఒక తెగ బోయజాతి – పేరు చివర మిస్సింగ్! (2)
15. పూజాకాలమునను ఉత్సవసమయమునను దేవతా విగ్రహము లుంచుటకై నాల్గు స్తంభములమీఁద చుట్టును తెఱపిగఁ గట్టిన కట్టడము – తడబడింది (3)
17. – – – మహాపచ్చడి.. పెరుగేస్తే మహత్తరి.. అది వేస్తే అడ్డ విస్తరి– అని వేటూరి గారి పాట – కాస్త చెల్లాచెదురైంది (3)
18. సమాప్తమగు, ముగియు: 4,1,2,3 (4)
19. చక్కఁగా కడుగుట (4)
20. మొదట్లో దీర్ఘమిచ్చినా ఇవ్వకున్నా అరుపు అనే! (3)
22. మీనాక్షి వదిన: మీనాన లేదు (3)
23. తలక్రిందులుగా మొలిచిన అశ్వత్థము (2)
24. గతేడాది (3)
26. క్లుప్తంగా గౌరీపతి నిమ్మకాయల (2)
27. పిల్లంగ్రోవిని తిరగేసి పట్టుకున్నట్టున్నారు – సరిగా పలుకుతుందా మరి?(3)
29. జత / యుగ్మము (3)
31. దీనికి యంగు చేర్చండి – కొఱ్ఱలో / నల్లావాలో కన్పిస్తాయి (1)
32. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో ఇది 24వ రాగం : దీనికి వీరవసంతమని కూడా పేరుంది . ఈరాగమంటే వానదేవుడికిష్టమా? (5)
33. వ్యంజనవర్ణములలోని యిరువదియాఱవ యక్షరము – ఉరుదులో ముప్పదియైదవ యక్షరము (1)

నిలువు:

2. ధమ్మిల్లము (2)
3. దేవుడు ప్రత్యక్షమైతే అడిగేది ఖంగారులో తడబడింది (3)
4. గెలుపు (3)
5. ఆగు (2)
7. కర్ణాటక సంగీతంలో 45వ మేళకర్త రాగము: వినాయకచవితి సినిమాలో దినకరా శుభకరా అన్న పాట ఈ రాగము ఆధారముగా స్వరపరచబడినది ; శోకములు లేకుండా శుభము పంతులు శోక వరాళి (7)
9. కీలు గుర్రం చిత్రంలో ఎవరు చేసిన ఖర్మ – రచనః తాపీ ధర్మారావు; సంగీతం, గానంః ఘంటసాల; లవకుశ చిత్రంలో ఏ నిముషానికి ఏమి జరుగునో – రచనః కొసరాజు; సంగీతం, గానంః ఘంటసాల; జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమలో “యమహో నీ యమా యమా అందం” పాట – ఫై పాటలన్నీ ఈ రాగంలోనే స్వరపరిచారు : కర్ణాటక సంగీతంలో 15వ మేళకర్త రాగము (7)
10. రావు గోపాలరావు గారిని ప్రేమతో ఇలా గౌరవిస్తారు – చివరలో కొంచెం వత్తండి -కాస్త ముందు వెనుక అయినట్లుంది (5)
12. కొలువు (2)
14. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 30 వ మేళకర్త రాగము – పనికి ఎగనామం బెట్టి కామధేనువు కూతురుని అతికించండి – ఈ రాగం వినిపిస్తుంది (5)
16. నీటి ప్రవాహములో నుండు మిక్కిలి లోతైన మడుగు – కొంచెం దట్టంగా వెతకండి (3)
17. గచ్చచెట్టు (3)
21. మనోజ్ఞము (2)
24. ప్రేమాతిశయమున ఒడలిని మెల్లగా తడవు (3)
25. ఇష్టుడు కిందనుండి పైకి వెళ్ళాడు (3)
28. వజ్రము – చివర వత్తినా వత్తకున్నా (2)
30. ఫల్గునీ నదీ ప్రాంత నగరము. బీహారు రాష్ట్రమునందలి ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రము – అక్షయవటము ఇక్కడే ఉంది (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 జూలై 02తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 121 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 జూలై 07 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 119 జవాబులు:

అడ్డం:   

1.దరమము 4. దగాకోరు 7. దరహాసము 8. కద 10. దర 11. ముచ్చిక 13. పంరిము 14. దర్పము 15. దడము 16. మునద 18. వలు 21. ముడి 22. దమునసుడు 23. ముర్మురుడు 24. దలిమము

నిలువు:

1.దరకము 2. మద 3. మురళి 4. దసరా 5. గాము 6. రుధిరము 9. దచ్చికడలు 10. దరిసెనము 12. దర్పణం 15. దవనము 17. దడిపము 19. దముడు 20. వసుద 22. దరు

సంచిక – పద ప్రతిభ 119 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11.00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.]

Exit mobile version