‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పదకొండుమంది రుద్రులు, వీరిని బ్రహ్మమానస పుత్రులని కొన్ని గ్రంథాలంటాయి, మూడు, నాలగు అక్షరాలు తారుమారయ్యాయి (7) |
8. మోక్షము (2) |
8A. అటునుంచి వచ్చిన పగ, కోపం, దురద (2) |
10. ఈశ్వరుడు, ఉమాపతి (3) |
13. పుట్ట, తడబడింది (3) |
15. తారుమారయిన స్థితి, పదునెనిమిది రెప్ప పాట్ల కాలము (2) |
16. తేజస్సు (3) |
18. జొన్న మొదలగువాని వెన్ను (2) |
19. గుర్రము, బాణము, పక్షి (2) |
20. మెట్టు, పై క్రమము, బడాయి, గొప్పదనము (2) |
21. విడుచుట, శక్తి, నష్టం (2) |
23. లోపించినది, దొంగసొమ్ము (3) |
25. ఔరా, సంతోషం, సంతాపము, ఆశ్చర్యము (2) |
26. ఆజ్ఞ, లక్ష్యము (3) |
28. తపస్సు, వేసంగికాలము, ఒక లోకము (3) |
29. కుడి నుంచి ఎడమకి ధనము, ఉత్తమ స్త్రీ (2) |
31. తేట, దృష్టిపూర్వక, అనాయాసముగా, (2) |
32. గాధి కుమారుడు (7) |
నిలువు:
2. మన్మథుడు (3) |
3. బలిమి, పార్వతి, సామర్థ్యము (2) |
5. ముని, మహర్షి (2) |
6. చెల్లాచెదురైన నాగమాత (3) |
7. ఓ మహర్షి, అరుంధతి భర్త, బ్రహ్మ కుమారుడు (7) |
9. ఆదికవిగా ప్రసిద్ధుడైన మహర్షి, ప్రచేతసుడి కుమారుడు (7) |
11. క్రింద నుంచి పైకి కాపాడు, భక్తులు __ము దేవా అని ప్రార్థిస్తారు (2) |
12. సీత, పార్వతి, అంగారకుడు (2) |
14. రాపులుగు, పద్మము (2) |
16. ప్రకాశించు, ఒప్పు (3) |
17. సంతోషము (3) |
22. తిథి విశేషము, ముంత, ఒక గోపకుడు (2) |
24. కింది నుంచి పైకి – తపింపజేయఁబడినది; కాఁచఁబడినది (2) |
25. చివర లేని నది, ఏరు (2) |
27. శ్వాస మలరు – 4, 3, 1 (3) |
28. చివరలో దీర్ఘం లోపించిన రీతి, పద్ధతి, ప్రకారం (3) |
30. ప్రోగు, రాశి, గడ్ది మేటి (2) |
31. తడి, చెమ్మ, ఆర్ద్రత (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 31 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 147 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జనవరి 05 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 145 జవాబులు:
అడ్డం:
1.ఆర్చేవారేగాని 4. అరుంధతీ 8. టస్సా 9. దేవకీయము 11. ప్రవా 13. ములక 15. మహేంద్రి 16. మునపలే 18. నోములు 19. తరంగిణి 20. ద్యూతము 21. లియుబ 24. పిన్న 25. కపాటభృత్తు 26. పాప 29. లులితము 30. అలివేలుమంగ
నిలువు:
1.ఆరాటము 2. వాగ్మి 3. గారవము 5. రుంజ 6. తీర్చేవారు లేరు 7. నాయక 10. కీలరముసేయుట 12. మహేంద్రగిరి 14. మౌనవ్రతము 17. మాతరపితలు 21. లిపాక 22. బభృమాలి 23. త్రిపథగ 27. ధాత 28. తేలు
సంచిక – పద ప్రతిభ 145 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- పి.వి.రాజు, హైదరాబాదు
- రామలింగయ్య టి, తెనాలి
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.