Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 149

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గొప్పవారు ఏ కారణము లేకుండా ఎక్కడికీ రారు అని చెప్పే సామెత (9)
6. రంధ్రము (2)
7. లక్ష్మి, నాలుక, కదలునది (2)
8. మన్మథుడిని గట్టిగా పిలవండి (3)
10. క్రమము, ప్రేమ, వికాసము, సొగసు (2)
11. తిరబడడిన ఆడుది, కొమ్మ, పుట్ట చివర (2)
12. పెద్ద దోస మొక్క (5)
13. అగస్త్య వృక్షము, అవిసె చెట్టు (3)
14. పాటలము, శ్వేతము, ఒకానొక పిట్ట (2)
15. బంధువు ఉంటే మంట అక్కరలేదని సూచించే సామెత (9)

నిలువు:

1. ఎక్కడైనా ఊరు ఉంటే, అక్కడ మాలపల్లి కూడా ఉంటుందనే సామెత (9)
2. దినుసు, సుందరం (2)
3. రతనాల సీమ, దత్తమండలాలు (5)
4. భూమి, ఆవు (2)
5. కులమింటి కోతైనా మేలు – సామెత కింద నుంచి వచ్చింది (9)
9. పార్వతి, మాదిఫలం, కొండ యరటి (3)
11. చివర లేని కోతి (2)
12. జీవితంలో ఎలా జరగాలని ఉంటే, అలా జరుగుతుంది అనడానికి వాడే మాట (4)
13. పచ్చదనం (3)
14. నిలుకడ, మొక్కలకు నీళ్లు పోయుటకై క్రింద కుదురుగా చేసిన పల్లము (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 జనవరి 14 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 149 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 జనవరి 19 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 147 జవాబులు:

అడ్డం:   

1.ఏకాశదరుద్రులు 8. ముక్తి 8A. సిక 10. శివుడు 13. వకంల్మీ 15. ష్ఠకా 16. తేజము 18. కంకి 19. వాజి 20. దర్జా 21. హానం 23. లుప్తము 25. ఆహా 26. ముదల 28. తపము 29. మవా 31. తేర 32. విశ్వామిత్ర మహర్షి

నిలువు:

2.కాముడు 3. శక్తి 5. రుసి 6. ద్రుకవ 7. వశిష్ఠ మహాముని 9. వాల్మీకి మహాముని 11. వుకా 12. కుజ 14. కంకం 16. తేజిలు 17. ముదము 22. నంద 24. ప్తత 25. ఆప 27. లమశ్వా 28. తరహ 30. వామి 31. తేమ

సంచిక – పద ప్రతిభ 147 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version