‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. ప్రభావతీప్రద్యుమ్నము కావ్య కర్త (6) |
6. యజ్ఞము (2) |
8. లేత తమలపాకు (3) |
10. దేవాలయం (2) |
13. ఒక తీపి వంటకం – లాంటి బాజాలని జి. ఎస్. లక్ష్మిగారి శీర్షిక (2) |
14. ఒకవైపు గోడలేని గుర్రాల శాల (3) |
16. సుభాష్ చంద్ర బోస్ (3) |
18. ఆనవాయితీ (3) |
19. శ్రీ కాళహస్తీశ్వర శతక కర్త (3) |
20. శ్రేష్ఠత్వము (3) |
21. చతుర్థము (3) |
22. అంతం లేని అదృష్టవంతుడు (3) |
23. భూస్వామి చివర బరువెక్కాడు (3) |
24. కవోష్ణ —- జ్వాలల తోటి స్వతంత్ర సమరం నెరపండి అని తోలేటి వెంకట రెడ్డి గారి సందేశం (3) |
25. కోరికను ఆపునది. వివాదము – ఇది భోంచేయడమంటే బ్రహ్మగారి కొడుక్కి చాల ఇష్టం ! (3) |
26. వినాయకుడికి ఇష్టమని వండితే మొదట్లో కాస్త విరిగిపోయినై (3) |
28. మంత్రం తోటిదే (3) |
30. చత్రం లేని పంచతంత్రం – దీని గురించి పట్టుదల ఎందుకు లెండి? (2) |
32. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన ఈ భజన గీతాలంటే మహాత్మునికి చాల ప్రీతి అట (2) |
34. శకుంతల తల్లి (3) |
37. తల్లి (2) |
38. గోముఖ వ్యాఘ్రం లాంటిదే ఇది కూడా (6) |
నిలువు:
2. అసాధ్యము – లడ్డు కాదు (2) |
3. సర్కారు జిల్లాల మాండలీకంలో వేపుడు; ఇగురు (2) |
4. ధ్వని (3) |
5. చాలామంది హీరోలకున్న బిరుదులలో మొదటి భాగమిదేనట (2) |
6. —- మీ విధేయుడు (2) |
7. ఆంధ్రకేసరి గారి పేరులో చివరి అక్షరము మిస్సయింది (9) |
9. సతీసహగమనం నిషేధానికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త (9) |
11. ఫలము (2) |
12. మాతామహుడినో – పితామహుడినో – ఎవరైతేనేం, ఓ మారు పిలవండి (2) |
14. శివుడు – ధర్మస్థలి క్షేత్రంలో కొలువైనాడు (5) |
15. అప్పుడే పెళ్ళైన జంట (5) |
16. 1983 లో ఉత్తమ చలన చిత్రంగా నంది అవార్డును పొందిన విజయశాంతి సినిమా – టి. కృష్ణ దర్శకుడు (5) |
17. తోటకూర (5) |
27. మోక్షము (2) |
29. మూడు వేదములు (2) |
31. ఉత్తరాంధ్ర మాండలీకాల్లో తరువాత (3) |
33. తండ్రి (2) |
34. నేనే బహువచనంలో (2) |
35. యుగళము (2) |
36. కంపు కాదండీ బాబూ – పద్మరాగమణి (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జూలై 12వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 18 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జూలై 17 తేదీన వెలువడతాయి.
సంచిక – పద ప్రతిభ 16 జవాబులు:
అడ్డం:
1.భరతుడు 4. సాధారణ 8. తాళం 9. పరుసవేది 11. కోటి 13. విరోదం 15. ముకరకా 17. మల్లుకట్టు 18. కుముదినీనాధుడు 19. స్వర్గలోకం 20. రంగాయించు 22. మయుడు 24. హారం 25. అందడువారి 26. పాలు 29. భవభూతి 30. మందారము
నిలువు:
2.రచ్చ 3. డుగురువి 4. సామవేదం 5. రమ్యం 6. పాతాళము 7. ఇంటిగుట్టు 10. సరోజినీనాయుడు 12.. అరకులోయ 14. అల్లుడుగారు 16. కాముకం 17. మధురం 19. స్వతహాగా 21. చుట్టలుగు 22. మదయంతి 23. డు వా చి మం 27. కోవ 28. తార
సంచిక – పద ప్రతిభ 16 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- ఎర్రోల్ల వెంకటరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- మధుసూదనరావు తల్లాప్రగడ
- పి.వి.ఆర్. మూర్తి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం . వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.