Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ – 192

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. జీవనదులకు పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చే పర్వం (4)
4. పూర్వజన్మమునందు చేయబడ్డది, శుభాశుభ కర్మము (4)
7. గాలి వీచే దిక్కు (5)
8. మాయ చేయు, పోగొట్టు (2)
10. చివర లేని లలాటము, నొసలు (2)
11. మిక్కిలి భయపడినది (3)
13. వీధి తిరుగుడు, కుని, ఆర్పివేయు (3)
14. పరిశుభ్రము, పవిత్రత, స్పష్టత (3)
15. రచనా బేధము, సంబంధం, జోక్యం (3)
16. ఏమరుపాటు, పరాకు, యాక్సిడెంట్ (3)
18. కత్తి పిడి, పిడికిలి, సమృద్ధి, ముసిడి (2)
21. చెంత, వేద పాఠము (2)
22. అవలీలగా, అనాయాసంగా (5)
24. చిన్న గంతు (4)
25. చెల్లాచెదురైన మహానందం (4)

నిలువు:

1. తెలుగు మాసములలో పదవది (4)
2. సంగీతంలో ఉండేవి, చివరి అక్షరం లోపించింది (2)
3. కదలిక, చలనం, సొగసైన (3)
4. దొప్ప, తామరపువ్వు, జాజికాయ (3)
5. రాలేము, సీనియర్ ఎన్.టి.ఆర్ సినిమా పేరు, నందమూరి బాలకృష్ణ, రజని సినిమా కూడా (2)
6. పులిజూదం, పులి మేక ఆట – క్రింద నుంచి (4)
 9. సంతానం లేనివారు చేసే యాగం (5)
10. విభక్తి లోపం లేని సమాసం (5)
12. గుచ్ఛకము, పూల గుత్తి, 32 పేటల హారం, పొద, నెమలిపురి (3)
15. ప్రథములు, శ్రేష్ఠులు, ముఖ్యులు, (4)
17. పెదవి, ఓష్ఠము (4)
19. క్రింద నుంచి పైకి – వంశము, ఇల్లు, మేను (3)
20. ఆకులు, పూవులు మొదలగువాటికుండే కాడం, వృంతం (3)
22. నామము (2)
23. పాట, శబ్దం, ధ్వని, స్తుతి (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 నవంబర్ 11 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 192 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 నవంబర్ 16 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 190 జవాబులు:

అడ్డం:   

1) పూజనము 4) పురుహూతి 7) నవమాలిక 8) రావి 10) వాన 11) లురుకు 13) దామము 14) ఝషము 15) విమానం 16) న్యాయము 18) దుల 21) నఖ 22) రోహిణీపతి 24) డునుదమ 25) ముసలము

నిలువు:

1) పూజ్యురాలు 2) నన 3) మువర 4) పులినం 5) రుక 6) తిమ్మనము 9) విరులమాల 10) వామనయన 12) విషధి 15) విదురుడు 17) ముఖరము 19) మహిమ 20) పాపము 22) రోద 23) తిస

సంచిక – పద ప్రతిభ 190 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version