‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. సప్తరుషి లా ధ్వనించే అగ్ని, సప్తజిహ్వుడు (4) |
| 4. కృష్ణుడు/భీముడు (4) |
| 7. భక్ష్య పదార్థం (5) |
| 8. లత (2) |
| 10. ఎక్కువ (2) |
| 11. పన్ను (3) |
| 13. ముందస్తు సమాచారం లేకుండా వచ్చేవాడు (3) |
| 14. చందా (3) |
| 15. అప్పు (3) |
| 16. చెల్లాచెదురైన శాశ్వతము (3) |
| 18. ఆలపించు (2) |
| 21. ముల్లు (2) |
| 22. శ్రీరాముడి పాలనని ఇలా అంటారు (3) |
| 24. సంగ్రహమైన (4) |
| 25. ముచ్చట్ల తోటివి (4) |
నిలువు:
| 1. సరైన ప్రతిభతో తీరైన కందం రాద్దాం – ఈ వాక్యం లోంచి, 1, 4, 8, 11 అక్షరాలు వ్రాయండి (4) |
| 2. ధ్వని (2) |
| 3. వర్షబిందువు (3) |
| 4. డాబు (3) |
| 5. తొండము (2) |
| 6. శుక్లపక్షంలోని చతుర్థి (4) |
| 9. గదను ధరించినవాడు (5) |
| 10. ఆబ్దికానికి ముందురోజు చేసే ఉపవాసం (5) |
| 12. హంస (3) |
| 15. అవధిలేని (4) |
| 17. కవాటములు (4) |
| 19. మీరు (3) |
| 20. పూజింపదగినది (3) |
| 22. ఆటలేని గోపికాకృష్ణుల నృత్యం (2) |
| 23. గర్వం (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 డిసెంబర్ 02 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 195 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 డిసెంబర్ 07 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 193 జవాబులు:
అడ్డం:
1) మామమామ 4) మచర్చిక 7) యశస్కరము 8) వనం 10) వీణ 11) ముదిత 13) కనుము 14) శ్రేష్ఠుడు 15) అర్ధము 16) అలవి 18) మనం 21) రజి 22) మమకారము 24) రురుజాలు 25) పరిభాష
నిలువు:
1) మాధవము 2) మాయ 3) మశకి 4) మరది 5) చము 6) కకంణము 9) నందివర్ధనం 10) వీనులలర 12) శిష్ఠుడు 15) అమరారు 17) విజిగీష 19) భామలు 20) మిరప 22) మజా 23) మురి
సంచిక – పద ప్రతిభ 193 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

