‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. సంకోచం (4) |
| 4.శరీర సంబంధమైనది (4) |
| 7. వెల్లుల్లి (5) |
| 8. అపుడు (2) |
| 10. పూర్వకాలపు నాణెము(2) |
| 11. సౌందర్యము/గర్వము (3) |
| 13. ప్రయోజనం లేనిది (3) |
| 14. శ్రీఘ్రము (3) |
| 15. ఓర్పు/క్షమ (3) |
| 16. ఇంద్రుని రథసారథి (3) |
| 18. సగమే ఉన్న స్మశానం (2) |
| 21. ముఖము కలది (2) |
| 22. సేవలు చేసే గృహము (5) |
| 24. తోటకాపరి అటూ ఇటూ చెదిరాడు (4) |
| 25. రామాయణం (4) |
నిలువు:
| 1. ప్రచురితము (4) |
| 2. చంద్రగుప్త మౌర్యుని తల్లి (2) |
| 3. అక్క/ చెల్లెలు తడబడింది (3) |
| 4. కూర (3) |
| 5. 20 దస్తాల కాగితాల కట్ట (2) |
| 6. చేతికి ధరించే ఒక నగ (4) |
| 9. మ్రాని పసుపు (5) |
| 10. అర్థము కలది (5) |
| 12. దేవతా విగ్రహం (3) |
| 15. పెద్దగాలి (4) |
| 17. వ్రాయదగినది (4) |
| 19. తోకా? అటు ఇటు లాగబడింది (3) |
| 20. అనుకరింపబడినది తలక్రిందులైంది (3) |
| 22. దండు, సైన్యము (2) |
| 23. శివుని వాహనమైన వృషభము (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2025 డిసెంబర్ 23 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 198 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2025 డిసెంబర్ 28 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 196 జవాబులు:
అడ్డం:
1) పాదుకాపట్టాభిషేకము 5) యమభగిని 6) టిక్కి 7) దృశ్యము 8) దార 11) మర్యాద 12) బహుధరము 13) తరకటబరకట
నిలువు:
1) పాలమున్నీటికొమరిత 2) కాత్యాయని 3) షేధనిము 4) ముకురతోరణములు 9) బదనిక 10) గంధముక 12) బడబ
సంచిక – పద ప్రతిభ 196 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె., ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకరరావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

