Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-200

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. సూర్యుని వెలుగు, సూర్యుని కిరణము (4)
4. ఒకనికి బదులుగా వచ్చినవాడు, ప్రతిమ, మారు, ఏజంటు (4)
7. కుడి నుండి ఎడమకు – గురి, దుస్తులు కుట్టడానికి కొలత, నమూనా వస్తువు, మూలం, మొదలయిన, (2)
8. సిసలైన, పక్వమైన, సిద్ధమైన, నిండైన, పచ్చిదైన, దృఢమైన (2)
9. నవ్వు ముఖం (4)
10. సుత్తి, ఇనుప గుదియ, మొగ్గ, ఒక జాతి మల్లె (4)
11. పేరు, ఆహ్వ, నది (1)
12. భూమి (4)
14. శుభరాత్రి కాదు, దీపావళి (4)
16. కొండ, పత్తి, ధరించే (2)
18. ఐదు తర్వాత వచ్చే అంకె, నూగారు, నింద (2)
19. వడ్ల చిలక, ఏ పనైనా చేసి ఏమీ తెలియనిదానిలా ఉండే స్త్రీ, చతురురాలు, గడసరి (4)
20. క్రీడాకారుడు (4)

నిలువు:

1. మహాభారతంలో దుర్యోధనుడు పాండవులకు __ మోపినంత భూమి కూడా ఇవ్వనన్నాడు (4)
2. క్రింద నుంచి పైకి పూజ్యురాలు, పార్వతి, అత్త, కన్య (2)
3. కుక్క (4)
4. పెద్ద నవ్వు, అట్టహాసం, గేలి (4)
5. క్రింద నుంచి పైకి – కార్యము, కృత్యము, వ్యాపారం, చేష్ట, ప్రయోజనం (2)
6. అగౌరవము, ఎదిరించటం, నింద, బెదిరింపు, (4)
12. సాయంసంధ్య (4)
13. క్రిందనుంచి పైకి బొమ్మలు గీసే చోటు, బొమ్మలమ్మే స్థలం, గ్యాలరీ (4)
14. స్వర్గం, హాయిని కల్గించే (4)
15. కుబేరుడు (4)
17. తగరము, నాట్యస్థానం, యుద్ధభూమి (2)
18. పంచభూతాలలో ఒకటి – చివరి అక్షరం కోల్పోయింది (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జనవరి 06 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 200 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 జనవరి 11 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 198 జవాబులు:

అడ్డం:   

1) ముదముద 4) శారీరకం 7) రసోనకము 8) తదా 10) అణ 11) మురువు 13) వ్యర్థము 14) గ్రక్కున 15) ఓరిమి 16) మాతలి 18) రుద్ర 21) ముఖి 22) సేవాసదనం 24) లివనమా 25) ఆదికావ్యం

నిలువు:

1) ముద్రితము 2) ముర 3) దసోరి 4) శాకము 5) రీము 6) కంకణము 9) దారుహరిద్ర 10) అర్థవంతము 12) ఠక్కురం 15) ఓరుగాలి 17) లిఖితవ్యం 19) లవామా 20) ర్శందఆ 22) సేన 23) నంది

సంచిక – పద ప్రతిభ 198 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version