Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-203

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) భయపడిన, వెరచిన (4)
4) నైరుతి దిక్పాలకుడు నిరృతి భార్య (4)
7) శరీరం, బాలింతలకి మందు, గుణం, సమూహం, ఇల్లు, (2)
8) వర్షము (2)
9) సరస్వతి, ఒక ఛందస్సు (4)
10) క్షమించదగిన, ఓర్వదగిన (4)
11) డాకడ, ఎడమ, డామాపు, సవ్యము (1)
12) వచ్చుచు పోవుచున్నది (4)
14) వ్యాపారం కొరకు అమ్మకందార్లు, కొనుగోలుదార్లు చేరే చోటు, గంజ్ (4)
16) ఏనుగు, సాక్షి, నిదర్శనం (2)
18) తల్లి యొక్క తండ్రి, తండ్రి యొక్క తండ్రి (2)
19) అతిశయము, తీవ్రము (4)
20) అంధకారం, చీకటి, పొగరు (4)

నిలువు:

1) క్రింద నుంచి పైకి – వీలు, వెసులుబాటు, ఎడం, తెరపి, చివరి అక్షరం  ‘శం’ బదులు ‘సం’ వ్రాయండి (4)
2) మూడింటి సమూహం (2)
3) కారం వేయక, పోపు పెట్టక ఉడికించిన పప్పు (4)
4) తాడిచెట్టు, కొబ్బరిచెట్టు లాంటి పొడవైన చెట్టు (4)
5) దేవుడిని గట్టిగా పిలవండి (2)
6) నమ్రత, అణకువ (4)
12) యజ్ఞాదులను నిర్వర్తించు ఋత్విగ్భావము, మోదుగుచెట్టు (4)
13) పనులు సక్రమంగా చేయటం (4)
14) కొలువు పెద్ద, సభాధ్యక్షుడు, ఇంటిపెద్ద (4)
15) రంగు వేయబడిన, ఉల్లాసపరచబడిన (4)
17) ఉన్మాదము, పిచ్చి, వెర్రి (2)
18) బృహస్పతి భార్య, వాలి భార్య, నక్షత్రము (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జనవరి 27 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 202 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఫిబ్రవరి 01 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 201 జవాబులు:

అడ్డం:   

1) లోకపితామవునివ్రాత 5) భిత్తిక 6) రామాయణము 7) మాత 8) పృథ్విక 9) మూక 12) ణరధా 13) అందాలు 14) లోకప్రకాశనుడు

నిలువు:

1) లోకాభిరామాయణము 2) పిటకము 3) నిలయము 4) తలమునకలగుట 10) కధానిక 11) మేలుకొను 13) అంధకా

సంచిక – పద ప్రతిభ 201 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version