Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-204

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు, మగధీర సినిమాలో కాజోల్ పాత్ర పూర్వజన్మ పేరు (4)
4. నమ్మకం లేకపోవడం (4)
7. పద్మాకరము, తామరకొలను, సరస్సు (5)
8. బరువు, కాడి, పూచీ, (2)
10. రాత్రి శేషము, ఆవు, చేదు సొర, రాత్రి, బాణుడి కూతురు (2)
11. వంగనము, వంశము (3)
13. సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే పొగ, పొగకు సాధనమయ్యే సుగంధ ద్రవ్యం (3)
14. ఔదార్యం, దానశీలం, ఈవి (3)
15. ఆరోగ్యం, శక్తత, నైపుణ్యము 3)
16. రాత్రి, పసుపు (3)
18. సంతాపం, బాధ, ఎత్తు, ముందుభాగం (2)
21. శిరస్సు, కొన, పూనిక (2)
22. చెడ్డ ముహూర్తం (5)
24. ఎట్టఎదుట, ఎదురెదురుగా,  (4)
25. దుర్గతి, పాపాత్ములను బాధపరుచు నొకానొక లోకము (4)

నిలువు:

1. స్నేహం, మైత్రీ భావన (4)
2. ఆశ్చర్యము (2)
3. తెలివి లేని వ్యక్తి, అజ్ఞుడు, జడుడు, మూర్ఖుడు (3)
4. ఇష్టం లేకపోవటం (3)
5. ధనువు, వీలునామా, మరణశాసనం (2)
6. సంబరం, జాతర, సేవ (4)
9. కళ్యాణ మండపం (5)
10. శాంతించిన స్త్రీ (5)
12. తల్లితనం (3)
15. అధోలోకం, భూమికి కింద ఉన్న ఏడు లోకాలలో చివరిది (4)
17. ఉనికిపట్టు, వాసస్థానం, ఇల్లు (4)
19. తెలుగు సంవత్సరాలలో 30వది (3)
20. ప్రవర్తన, నడవడి, జీవనము (3)
22. దుమ్ము (2)
23. చంద్రగుప్తుని తల్లి, గంధ ద్రవ్య విశేషము (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఫిబ్రవరి 03 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 204 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఫిబ్రవరి 08 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 202 జవాబులు:

అడ్డం:   

1) పూలమాల 4) పురుహూతి 7) నటవరుడు 8) రాధ 10) పాప 11) లురావా 13) సర్వము 14) అన్యుడు 15) అరుదు 16) శ్రీదేవి 18) పడు 21) విభా 22) కాలక్షేపము 24) జిహాసువు 25) దనుర్ధారి

నిలువు:

1) పూజ్యురాలు 2) మాన 3) లటభం 4) పురురం 5) రుడు 6) తిరిపము 9) ధరామరుడు 10) పార్వతీదేవి 12) ధన్యుడు 15) అపరంజి 17) విభావరి 19) నెలవు 20) ఆపద 22) కాసు 23) మును

సంచిక – పద ప్రతిభ 202 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version