‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) శివుని గూర్చిన పండుగ, శివ సంబంధితమైన ఉపవాస దినము (4) |
| 3) ఓడలో సరుకు ఎక్కించి, ఓడల అధికారి ఇచ్చే రసీదు (4) |
| 6) మంచి రోజు (4) |
| 9) అయిష్టాన్ని తెలియజేస్తూ మాట్లాడకుండా ఉండడం, తారుమారయింది (4) |
| 11) మన రాతలు బ్రహ్మ _ _ _ న రాస్తాడట (3) |
| 12) శివుడు తడబడి చెదిరాడు, ‘శు’ బదులు ‘సు’ వ్రాయండి (4) |
| 13) చెదిరిన సమూహము, గుంపు (4) |
| 14) ఎడమ నుంచి కుడికి త్రినేత్రుడు, శివుడు (3) |
| 15) ఇరవై, రెండు పదులు (4) |
| 17) బాణం బహువచనం – చివరి అక్షరం ముందుకొచ్చింది (4) |
| 20) ప్రత్తి, నూలు, వస్త్రము, కాగితము (4) |
| 21) ఎడమ నుంచి కుడికి, పసుపురంగు రత్నవిశేషము (4) |
నిలువు:
| 1) తల (3) |
| 2) మొదటి అక్షరం లోపించిన అర్చన, పూజ (3) |
| 4) ధనము, దాయం, ఆస్తి (3) |
| 5) మాఘ కవి రచించిన కావ్యము, తెలుగు మాసములలో ఒకటి (3) |
| 7) సాటిలేనిది, నిరుపమానమైనది (5) |
| 8) ఇదివరకటిది, ముందరిది (5) |
| 9) మాత్రలు, వడియములు (5) |
| 10) ఏదైనా భాషలో నిపుణుడు, హిందీ, సంస్కృతంలలో ఒక కోర్సు (5) |
| 15) సంబంధము, అధికారము లోచేరిన ప్రదేశము – అన్యదేశ్యము (3) |
| 16) ప్రవాసము, పరదేశమునకు పోవుట (3) |
| 18) వెంట్రుకలుండునది, తోక, వాలధి (3) |
| 19) వంశము, పేరు, గొడుగు, అడవి – క్రింద నుంచి పైకి (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఫిబ్రవరి 10 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 205 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఫిబ్రవరి 15 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 203 జవాబులు:
అడ్డం:
1) సంత్రస్తము 4) దీర్ఘాదేవి 7) కాయం 8) వాన 9) అనుష్టుప్పు 10) క్షంతవ్యము 11) డా 12) యాతాయాతం 14) గోష్టాగారం 16) కరి 18) తాత 19) ముమ్మురము 20) తిమిరము
నిలువు:
1) సంకావఅ 2) త్రయం 3) ముద్దపప్పు 4) దీర్ఘవృక్షం 5) దేవా 6) వినయము 12) యాజ్ఞికము 13) తంత్రణము 14) గోష్ఠీపతి 15) రంజితము 17) రిమ్ము18) తార
సంచిక – పద ప్రతిభ 203 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్. వి బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త, ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాదు
- ఉషారాణి. జి, తిరుపతి
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

