‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) తామర, బాణము, తామరతంపర (4) |
| 3) ఔషధము, మందు (4) |
| 6) గర్వము, నడక యందలి కులుకు, (4) |
| 9) సులభము (4) |
| 11) అటునుంచి వచ్చిన – నిర్బంధము, సారము, నిష్కర్ష (3) |
| 12) నాగవల్లి, తమలపాకు తీగ (4) |
| 13) చెదిరిన ఓ తెలుగు నక్షత్రం, జ్యేష్ఠమాసంలో వచ్చే కార్తె (4) |
| 14) చెదిరిన పాత్ర, కంచము, నాట్యమాడెడు స్త్రీ (3) |
| 15) సర్పము కరుచుట (4) |
| 17) మూడు మూడు అడుగులు కలది, త్రిగుణము (4) |
| 20) మనోజ్ఞురాలు, ముద్దుగుమ్మ (4) |
| 21) కారెనుపోతు; స్వర్గము (4) |
నిలువు:
| 1) నాటనము, నారులోనగువానిని నాటుట, నృత్యము, (3) |
| 2) ఆంధ్రపదేశ్ లోని ఒక జిల్లా పేరు, ఇంటి గడప, దేహళి (3) |
| 4) అరువది దినములలో పండెడు ధాన్యము (3) |
| 5) పెసలు (3) |
| 7) ఖాళీ హస్తము, ఒట్టి చెయ్యి (5) |
| 8) కునికిపాటు (5) |
| 9) అతి తీక్ష్ణమైనది (5) |
| 10) సముద్రుడు, కుబేరుడు (5) |
| 15) అడుగు, కిరణము, వేరు, పాతిక, (3) |
| 16) రక్షణము, రక్షణగా ఉండుట (3) |
| 18) మత్తుకలవాడు, భ్రమగలవాడు చెదిరాడు (3) |
| 19) స్వభావము, అలవాటు, అల్లెత్రాడు, సారము (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఫిబ్రవరి 24 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 207 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 మార్చ్ 01 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 205 జవాబులు:
అడ్డం:
1) శివరాత్రి 3) వారినామా 6) సుదినము 9) వముభాము 11) నుదుట 12) పసుతిప 13) కరప్రము 14) టిక్కంము 15) ఇరువది 17) లుబాణము 20) కార్పసము 21) కంధిమేగో
నిలువు:
1) శిరసు 2) రాధన 4) రిక్థము 5) మాఘము 7) దినుసుమీరు 8) మునుపటిది 9) వటకములు 10) భాషాప్రవీణ 15) ఇలాకా 16) వలస 18) బాలధి 19) ముత్రగో
సంచిక – పద ప్రతిభ 205 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్. వి బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాదు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- ఉషారాణి. జి, తిరుపతి
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

