‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. ఏ స్త్రీ (4) |
| 4. కంఠాభరణ విశేషము (4) |
| 7. సూర్యుడు (5) |
| 8. ఆశ్రయము, రక్షణ (2) |
| 10. సౌందర్యం, చక్కదనం – చివరలో తగ్గిపోయింది (2) |
| 11. బీజాక్షర చక్రము, సూత్రము, తిరుగలి, ఉపాయము (3) |
| 13. స్త్రీ, బలము లేనిది (3) |
| 14. శచీదేవి, ఇంద్రుని భార్య (3) |
| 15. యథార్థముగా ఎరుగదగినది, సంగతి, సమయం (3) |
| 16. దోషములు చేసినవారు (3) |
| 18. వర్షము, వాన (2) |
| 21. కుడి నుంచి ఎడమకి – గానం చేయు (2) |
| 22. కర్ణుని విల్లు, రాపులుగు పక్షి (5) |
| 24. కుడి నుంచి ఎడమకు – నిరుటికి తొలి సంవత్సరం (4) |
| 25. వెనుక నుంచి ముందుకు వచ్చిన కుటిల మనసు గలవారు (4) |
నిలువు:
| 1. పడుచుదనము, యౌవనము (4) |
| 2. కడ, అంతము, చివరిది (2) |
| 3. బంగారం, స్వర్ణము (3) |
| 4. నాడ చేయు, నార్చు (3) |
| 5. మాట, నుడుపు, (2) |
| 6. విడుగడ, విడుగర, విమోచనము (4) |
| 9. కొడుకు పుట్టుటకై చేయునొక యజ్ఞము (5) |
| 10. శివుడు, ఒకానొక రాజు, సూర్యుడు, విష్ణువు, బాలుడు (5) |
| 12. నకులుని శంఖము (3) |
| 15. ప్రవర్తించినవాడు (4) |
| 17. క్రింద నుంచి పైకి – కులుకులు, గర్వము (4) |
| 19. పండు, ప్రయోజనము, పంట, లాభము (3) |
| 20. వ్యాపారము, పనులు, నడవడులు (3) |
| 22. మూడు దమ్మిడీలు, ఒక అణాలో నాల్గవ వంతు (2) |
| 23. ముంజేతికి ధరించెడు స్వర్ణాభరణం, చివర పోయింది (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 10 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 209 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 మార్చ్ 15 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 207 జవాబులు:
అడ్డం:
1) నాళీకము 3) భైషజము/భైషజ్యము 6) మురిపము 9) సుకరము 11) చ్చిక్కని 12) నాకబలి 13) శిమృగర 14) పారత 15) పాముకాటు 17) ముమ్మడుగు 20) ముద్దులాడి 21) సైరిభము
నిలువు:
1) నాట్నము 2) కడప 4) షష్టిక 5) ముద్గము 7) రిక్తకరము 8) ముచ్చిలిపాటు 9) సునిశితము 10) రత్నగర్భుడు 15) పాదము 16) కాపలా 18) మ్మదిరి 19) గుణము
సంచిక – పద ప్రతిభ 207 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్. వి బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాదు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- నాగమణి భాగవతుల, సికింద్రాబాద్
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి. జి, తిరుపతి
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

