Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-211

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రవీంద్రనాథ్ ఠాగూర్ బిరుదము (4)
4. ఇంద్రుని భార్య, శచి (4)
7. సూర్యుడు (5)
8. సారము, సమృద్ధి, చాతుర్యము (2)
10. అర్చన, సపర్య, (2)
11. ఆజ్ఞ, ఉత్తరువు (3)
13. పాట, తడబడింది (3)
14. అధికము, ఆధిక్యం, సంపద, పుష్కలం (3)
15. అద్దము, టీక, నకలు, మాదిరి, వ్రాయబడిన దాని మాతృక (3)
16. నాళము, గుఱ్ఱపు గట్టెలకు వేయు ఇనుపబిళ్ళ, లాడము (3)
18. మేము రావడం లేదు, రాలేము (2)
21. ఋషి, యతి, యోగి, మహర్షి (2)
22. సంతోషంతో, స్నేహముతో, ఇష్టంతో ఇచ్చిన కానుక; హరనాథ్ రాజు, విజయనిర్మల జంటగా నటించిన 1969 తెలుగు సినిమా (5)
24. నాలుగురు, మొదటి అక్షరం తీసేస్తే, రాజేంద్రప్రసాద్‌కి నంది అవార్డు తెచ్చిన ఓ సినిమా (4)
25. లోహ విగ్రహములను శుద్ధి చేయుటకుపయోగించు చింతపండు నీరు, చింతపండుతో దేవతామూర్తుల్ని శుభ్రం చేయడం (4)

నిలువు:

1. మనవి, విజ్ఞాపనము (4)
2. కవిత్వం చెప్పువాడు, వ్రాయువాడు (2)
3. వినుకలి, ఆకర్ణనము, వినికి (3)
4. భర్త గలిగిన స్త్రీ, సువాసిని (3)
5. జగం, ప్రపంచం, భువనము, రాష్ట్రము (2)
6. నీటి నుండి పుట్టినది, పద్మము, వారిజము (4)
9. నలిగినది, సతమతం లా ధ్వనించేది (5)
10. పోకచెక్క, వక్క (5)
12. సుధ, పాలు, సున్నము; హర్షవర్ధన్, గుండు హనుమంతరావుల పాపులర్ టీవీ సీరియల్ (3)
15. పూజ, హిందీలో రాజేష్ ఖన్నా, తెలుగులో సీనియర్ ఎన్.టి.ఆర్., తర్వాత కాలంలో చిరంజీవి సినిమా (4)
17. సాయంసంధ్య, ప్రదోషకాలం (4)
19. మాటిమాటికి, వేమాఱు, పెక్కుసారులు, మరల మరల (3)
20. మంచము, పరుపు (3)
22. ప్రేవు, ఆంత్రము (2)
23. ప్రస్తుత యుగము, పులియబెట్టిన కడుగునీరు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 24  వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 211 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 మార్చ్ 29 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 209 జవాబులు:

అడ్డం:   

1) ఎవతుక 4) నానుక్రోవి 7) దినకరుడు 8) ప్రాపు 10) అంద 11) యంత్రము 13) అబల 14) మఘోని 15) ప్రమేయం 16) దోషులు 18) వృష్టి 21) డుపా 22) కాలపృష్ఠము 24) డుయేనిము 25) లురుష్కము

నిలువు:

1) ఎలప్రాయం 2) తుది 3) కనకం 4) నారుచు 5) నుడు 6) విడుదల 9) పుత్రకామేష్టి 10) అంబరీషుడు 12) సుఘోషం 15) ప్రవృత్తుడు 17) లుపారిము 19) ఫలము 20) చేష్టలు 22) కాని 23) మురు

సంచిక – పద ప్రతిభ 209 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version