‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) చేరుచుక్క, పాపటబొట్టు (4) |
| 3) చెల్లెలు (4) |
| 6) శ్రేష్ఠము, కాంతి విశేషము, సొంపు (4) |
| 9) సూదంటురాయి (4) |
| 11) నిద్ర, చెదిరిపోయింది (3) |
| 12) అర్జునుడి విల్లు (4) |
| 13) ఆలోచనలు, చింతలు, కోరికలు, మనస్సులు (4) |
| 14) నిద్ర, చెల్లాచెదురయింది (3) |
| 15) శ్రమలు, పూనికలు, పది కల్సి చేసే పనులు (4) |
| 17) ముద్రించుట (4) |
| 20) సంబంధము లేని స్త్రీ, పరాయిది, తేరకత్తె (4) |
| 21) తడిసినది, ఆర్ద్రము (4) |
నిలువు:
| 1) కట్లతీగ; స్త్రీ జాతివిశేషము (3) |
| 2) నేర్పరి అయిన స్త్రీ, ఆడమృగం; ఈనాడు సంస్థల పత్రిక, విపులతో పాటు (3) |
| 4) వీణావాద్యము, వీణ (3) |
| 5) స్థిరమైన పక్షము; నిశ్చయము, నిర్ణయము (3) |
| 7) ఇంద్రజాల విద్య (5) |
| 8) ఉండలు ఉండలుగా (5) |
| 9) ఇతరము కానిది; మరొకటి కాని, మరొకరికి చెందినది (5) |
| 10) స్కందుని గురించి చరిత్ర, ఉప పురాణం (5) |
| 15) అపరంజి, మేలిమి బంగారము (3) |
| 16) తల్లి, దాది, పార్వతి, వర్ణమాల (3) |
| 18) నీళ్ళ వలె పలచగా ఉండే పదార్థము (3) |
| 19) బావుల నీళ్ళు పారించి పండించెడి పొలము, కోత కోసిన పొలము (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 31 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 212 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఏప్రిల్ 05 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 210 జవాబులు:
అడ్డం:
1) అభిజిత్తు 4) స్వాధ్యాయము 7) కక్ష 8) తిక్క 9) ముగరాప 10) యంత్రణము 11) ధీ 12) వరీయుడు 14) రాద్ధాంతమ 16) కవి 18) నాప 19) ములుసూపు 20) మానవతి
నిలువు:
1) అకల్కము 2) భిక్ష 3) త్తుషరిప 4) స్వాపతేయం 5) యతి 6) ముక్కనుము 12) వర్ణకము 13) డుత్ముణ్యాపు 14) రాజీనామా 15) మహాపతి 17) విలు 18) నావ
సంచిక – పద ప్రతిభ 210 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్. వి బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాదు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పాశేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి. జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

