Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-215

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అద్దము, పొగడ, మల్లెపూవు (4)
4. బొత్తిగా, పూర్తిగా, ఎంత మాత్రమూ (4)
7. పార్వతి, భార్య, పతివ్రత (2)
8. చప్పుడు, మ్రోత, రవళి, ధ్వని (2)
9. నారదుడు, తంపులు (ముడులు) పెట్టే ముని (4)
10. వ్యవసాయపులెక్క, వ్యవసాయం (4)
11. శివుడు, బ్రహ్మ, అగ్ని, ఖర్జూరం, వెండి, రజతం; వర్ణమాలలో ఐదవ అక్షరము (1)
12. నిలకడ లేకపోయిన, తారుమారైన (4)
14. జీతబత్తేలు లేకుండా పనిచేసేవాడు (4)
16. వ్యాపారము, కర్మము, కార్యము, ప్రయోజనము (2)
18. పలు, అనేక, సరస్వతి, తల్లి, కూతురు (2)
19. ఇప్ప చెట్టు, మామిడి చెట్టు (4)
20. కుడి నుండి ఎడమకు – గర్భిణిలకు 5వ నెలలో గాని 7వ నెలలోగాని చేసే వేడుక (4)

నిలువు:

1. రోకలి, అయోగ్రము (4)
2. ఆసక్తి, ఉత్కంఠ (2)
3. పైపై చేయు స్తుతి, ఎదురుగా పొగుడుట (4)
4. ఒకానొక మందాకు (4)
5. గోపకుల క్రీడావిశేషము, రసము, పరిహాసము, సల్లాపము, కలకలధ్వని, ధ్వని (2)
6. ప్రేమతో పిలిచే పేరు (4)
12. మేలైనది, సాటిలేనిది, చక్కనిది, నైరుతి మూల యందలి ఆడ ఏనుగు (4)
13. ఏనుగు (4)
14. మేలైన, ప్రశస్తమైన, ప్రకాండము, ఉత్తర పదమైనచో శ్రేష్ఠ వాచకము (4)
15.  క్రింద నుంచి పైకి ఓ ప్రసిద్ధ కవి, పోతన బావమరిది (4)
17. క్రింది నుంచి పైకి నది, ఏరు (2)
18. నొసట పెట్టుకునే నిలువు బొట్టు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 21 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 215 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఏప్రిల్ 26 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 213 జవాబులు:

అడ్డం:   

1) నేహరము 4) పరంపదం 7) వంశకరుడు 8) పవి 10) ధీత 11) రిష్వత్ 13) ఆసనం 14) ఆకృతి 15) ధనువు 16) కావుము 18) నాడు 21) డుక 22) నిరుకడము 24) రంద్వాఖము 25) పరిణతి

నిలువు:

1) నేరుపరి 2) రవం 3) ముశపా 4) పరువు 5) రండు 6) దంటతనం 9) విష్వక్సేనుడు 10) ధీసచివుడు 12) ప్రకృతి 15) ధనాగారం 17) ముకలతి 19) ఉరుము 20) కడప 22) నిఖ 23) మురి

సంచిక – పద ప్రతిభ 213 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version