Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-216

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) అక్రమము, సందర్భరహితమైనది, అస్తవ్యస్తం (4)
3) దేవకుసుమము, లవంగము (4)
6) కొత్తకొత్తగా (4)
9) నీరు, జలము (4)
11) సుమం-దళం-గిత్త – 1, 3, 6 (3)
12) గురువు, దేశము తిరుగువాడు – తడబడ్డాడు (4)
13) తడబడిన సుమారు, దాదాపు (4)
14) అటునుంచి వచ్చిన పురుగు, కీటకము (3)
15) గరుత్మంతుని కొడుకు, ప్రసన్నుడు, విద్వాంసుడు, విఘ్నేశ్వరుడు (4)
17) వెనక నుంచి ముందుకు –  ఆబోతు (4)
20) వైష్ణవుడు, జడలు కట్టిన జుట్టు (4)
21) చక్కగా ఉండు, ఒప్పిదము, రమణించు (4)

నిలువు:

1) పూజ (3)
2) తారుమారైన మనది (3)
4) ఐశ్వర్యము, సంపత్తి (3)
5) బావుల నీళ్ళు పారించి పండించెడి పొలము, కోత కోసిన పొలము (3)
7) కుంకుమపువ్వు; కుసుమపువ్వు (5)
8) శ్రీకృష్ణుని తండ్రి, దేవకి భర్త (5)
9) అత్తాకోడలి చుక్కలు, దూరదూరంగా ఉండే రెండు నక్షత్రాలు (5)
10) చిలుకలు మున్నగు పక్షులు కొఱుకకుండ పండ్లకు బుట్టలు కట్టిన మామిడి (5)
15) చక్కని పలువరుస గల ఆడది (3)
16) గుర్రపు డెక్క, గొరిజ, నఖమనెడు గంధద్రవ్యము (3)
18) క్రింద నుంచి పైకి -వేగముగ, చివరి అక్షరం ఇకారమైంది (3)
19) సమాప్తి, ఆరగింపు (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 28 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 216 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 మే 03 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 214 జవాబులు:

అడ్డం:   

1) పరులసొమ్ముపాపపుది 5) గులాబిపూవులమాలిక 6) లక్ష్యం 7) హ్రాదిని 8) దాత 11) జీవన 12) పరియవారు 13) డుల్లుయటిన్నీములపా

నిలువు:

1) పచ్చగుర్రాలవజీరుడు 2) లహబిరి 3) పరమార్థం 4) దివాకరతనయులు 9) అనసూయ 10) తుయగాల 12) పరున్నీ

సంచిక – పద ప్రతిభ 214 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version