Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-217

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) గంగానది (4)
3) గవ్వ, శివుని జడ ముడి (4)
6) మంటను పుట్టించునది, ఇంగిలీకము (4)
9) విశ్రాంతి లేకపోవుట (4)
11) సేవింపదగినది, కొలువు (3)
12) మయిలది, మలినము (4)
13) వెనుక నుంచి ముందుకి – వెండికొండ, కైలాసము (4)
14) గట్టిగా, ఇంచుమించుగా (3)
15) వర్తకుడు, ధనికుడు (4)
17) వెనుక నుంచి ముందుకు – అంతము లేనిది (4)
20) రోహిణి నక్షత్రము (4)
21) కనికరము, దయ (4)

నిలువు:

1) తుమ్మెద రొద (3)
2) మరదలు, తమ్ముని భార్య (3)
4) వెనుక చరణమందలి యర్థము ననుసరించి కీర్తన మొదట చెప్పు వాక్యము, పాటకు ప్రాణం ___ అని ‘వాసు’ సినిమాలోని పాట చెబుతుంది (3)
5) క్రింద నుంచి పైకి – అధర్వవేదము, జాల విద్య, రహస్యము (3)
7) సూర్యుడు, జగము కన్ను (5)
8) లెక్కలను పరిశీలించు ఉద్యోగి (5)
9) అచ్చు కానిది, ముద్ర వేయబడనిది (5)
10) శ్రీరాముని పుట్టుక (5)
15) మధురాది రసము (3)
16) రక్షకుడు (3)
18) పొట్టేలు (3)
19) పూజకు తగినది, షోడశోపచారాలలో ఒకటి (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మే 05 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 217 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 మే 10 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 215 జవాబులు:

అడ్డం:   

1) ముకురము 4) సుతరాము 7) సతి 8) సద్దు 9) ముళ్ళయతి 10) ఖిరదారు 11) ఉ 12) అస్తవ్యస్తం 14) తత్క్రియుడు 16) పని 18) నానా 19) మధుద్రుమం 20) ముతమంశ్రీ

నిలువు:

1) ముసలము 2) కుతి 3) ముఖస్తుతి 4) సునాముఖి 5) రాస 6) ముద్దుపేరు 12) అనుపమ 13) స్తంబేరమం 14) తల్లజము 15) డుథునాశ్రీ 17) నిధు 18) నామం

సంచిక – పద ప్రతిభ 215 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version