‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1. ఆకాశగంగ (4) |
| 4. పగడముతో చేసినది, పగడమునకు సంబంధించినది (4) |
| 7. జట, సుడి (2) |
| 8. వెనుక నుండి ముందుకు – మూట, ముల్లియ (2) |
| 9. పన్నెండు క్షణముల కాలము, అల్పకాలము (4) |
| 10. గోత్రనామములు చెప్పి పాదములు సోఁక మ్రొక్కువాఁడు, అభివాదకుఁడు. (4) |
| 11. వెంబడి, కూడ (1) |
| 12. ఓరచూపు (4) |
| 14. విష్ణువు, శివుడు, ఇంద్రుడు, అగ్ని (4) |
| 16. కవిత్వం చెప్పువాడు, పండితుడు (2) |
| 18. అటునుంచి – అనుభవ యోగ్యమగు; చేకూరు. (2) |
| 19. ముష్టిచెట్టు (4) |
| 20. వెనుక నుంచి ముందుకి – మన్మథుడు, మరుడు, మారుడు (4) |
నిలువు:
| 1. ప్రకాశితము, స్ఫురించినది, తోచినది (4) |
| 2. ఓడ, పొగ, మబ్బు, మాగాని (2) |
| 3. నిర్దేశింపబడినది (4) |
| 4. విశ్వదేవతలనుగూర్చి చేసెడు హోమాదికము, బ్రాహ్మణులు నిత్యము చేయవలసిన కర్మ (4) |
| 5. ఒక పువ్వు, అగ్ని (2) |
| 6. మోక్షముపొందు కోరిక గలవాడు, విడువనిచ్ఛగలవాడు (4) |
| 12. ప్రపంచమంతా పేరు పొందిన కవి, రవీంద్రుని బిరుదు (4) |
| 13. కచ్చపము, కాంతలకము (4) |
| 14. ఇంద్రుడు (4) |
| 15. రాజగృహ రచన (4) |
| 17. చేదు, జలము, గరళము – చివరి అక్షరం లేదు (2) |
| 18. క్రింద నుంచి పైకి – చెక్కు, ఎత్తు, చిత్తు, (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మే 12 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 218 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 మే 17వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 216 జవాబులు:
అడ్డం:
1) అడ్డాదిడ్డి 3) శ్రీసంజ్ఞము 6) నవనవ 9) ఉదకము 11) సుదత్త 12) కుశిడుదే 13) రమిమార 14) వురుపు 15) సుముఖుడు 17) బ్బగిడిము 20) తిరుముడి 21) రవణింపు
నిలువు:
1) అర్చన 2) దిమన 4) సంపద 5) ములుము 7) వహ్నిశిఖము 8) వసుదేవుడు 9) ఉత్తర పుబ్బ 10) కట్టుమామిడి 15) సుదతి 16) ఖురము 18) గిడివ 19) ముగింపు
సంచిక – పద ప్రతిభ 216 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పాశేష శాస్త్రి, ఆదోని
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

