Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-219

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) అంతఃపురం (4)
2) కలువపువ్వు (4)
7) శుశ్రూష, కొలువు (2)
8) సూర్యుడు (3)
9) నను _ _ మని చెప్పవే సీతమ్మ తల్లీ అన్నాడు రామదాసు (2)
12) ప్రయాణం, విల్లు (3)
13) ఏడుకొండలస్వామి భార్య, వైష్ణవదేవి (3)
17) నక్షత్రం (2)
18) సహ క్రీడ, లీల (3)
19) అర్చన, సపర్య (2)
22) వజ్రాయుధం (4)
23) హద్దు, ఎల్ల (4)

నిలువు:

1) ప్రశంసించు (4)
2) తారతమ్యం, ఆధిక్యం, ప్రసిద్ధి, లాభం, భేదం (2)
4) స్త్రీలు చేసే నృత్యం (2)
5) దేవాలయపు కోశాధికారి (4)
6) శ్రీహరి, త్రిమూర్తులలో ఒకరు (3)
10) తెరచాప (3)
11) కార్తికేయుడు, పరశురాముడు (3)
14) గురిజ, గురిగింజ (4)
15) ఊయల, డోల (3)
16) బ్రహ్మ, నలువ (4)
20) హిందీలో పినతండ్రి (2)
21) తోటను రక్షించువాడు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 మే 19 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 219 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 మే 24వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 217 జవాబులు:

అడ్డం:   

1) ఝంకారిణి 3) కపర్దము 6) రంజకము 9) అవిరామం 11) జుష్యము 12) కచ్చరము 13) ద్రితాజర 14) దాదాత 15) షావుకారు 17) ముతనంఅ 20) బండిరిక్క 21) కారుణ్యము

నిలువు:

1) ఝుంకారము 2) రిత్తిక 4) పల్లవి 5) ముత్రమం 7) జగచ్చక్షువు 8) ముజుముదారు 9) అముద్రితము 10) రామజననం 15) షాడబం 16) కాపరి 18) తగరు 19) అర్ఘ్యము

సంచిక – పద ప్రతిభ 217 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version