‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) ఒక విధమైన బంగారు నాణెము, శ్రేష్ఠము (4) |
| 3) తాయెత్తు, బిడ్డలకు దోషము తగులకుండుటకై కట్టెడు రేకు, (4) |
| 7) సంతోషము, పరిమళం (2) |
| 8) ఉభయకావేరీ మధ్యముననుండు ఒక దివ్యక్షేత్రము (3) |
| 9) వినువాడు (2) |
| 12) జలము, ధనము, న్యాయము, శ్రేష్ఠము (3) |
| 13) పరాజయము, భంగం, ఓడిపోవుట (3) |
| 17) ప్రకాశము, తేజస్సు (2) |
| 18) కదలిక, కదలుట, తిరుగుట, (3) |
| 19) దుర్యోధనుడూ, అతని తమ్ముళ్ళూ శకునిని _ _ అని పిలుస్తారు (2) |
| 22) పార్వతి, చంద్రకళ కానవచ్చెడి అమావాస్య (4) |
| 23) జీవాత్మ, పరమాత్మ, లోపలనుండువాడు (4) |
నిలువు:
| 1) నవ్వు ముఖము (4) |
| 2) రాగము, అనురాగము, శ్రావ్యత, గాన మాధుర్యము (2) |
| 4) చేరవలసినది, పొందదగినది, కోరదగినది (2) |
| 5) క్షమించు పిన్నీ తమ్ముడు సవ్యంగా మాట్లాడలేదు – 1, 4, 6, 10 (4) |
| 6) ఇఱ్ఱి; ఏనుగు; తుమ్మెద (3) |
| 10) వర్తకవ్యాపారము, ప్రతిమ (3) |
| 11) కూడిక, సురతము, సాంగత్యం, పొత్తు (3) |
| 14) శిష్యుడు, సమీపమున ఉన్నవాడు (4) |
| 15) కుబేరుని పట్టణం, ముంగురులు, రోషం (3) |
| 16) ఇంచుమించు, సుమారు, (4) |
| 20) వ్యాజ్యము, తగవు, చౌర్యము, కోర్టు కేసు (2) |
| 21) తోడబుట్టినవాడు, సోదరియు సోదరుడును (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూన్ 23వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 224 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 జూన్ 28వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 222 జవాబులు:
అడ్డం:
1) చాకచక్యం 3) జ్ఞపితము 7) పవి 8) స్రోతస్సు 9) ఛాయ 12) అర్పణం 13) భూకంపం 17) కక్ష్య 18) స్మేరము 19) గటిం 22) డువుధమా 23) త్రిధాముడు
నిలువు:
1) చారపథం 2) చవి 4) పిలు 5) ముళ్ళయతి 6) రేతస్సు 10) దర్పణం 11) రేకంటు 14) శ్రీకరుడు 15) గారము 16) జోటింగుడు 20) మేధ 21) తధా
సంచిక – పద ప్రతిభ 222 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె. ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంబర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

