‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) అగత్యము, అక్కర (5) |
| 5) నూరు, వంద (2) |
| 6) రథమును లాగెడు గుర్రము (2) |
| 8) సేవకురాలు (2) |
| 10) ప్రాణి సమూహము, గుంపు, సమాజం (3) |
| 12) వినయము, అణకువ – చివరి అక్షరం లోపించింది (2) |
| 13) సుఖము, సాతము, కృశించినది, వందలో ఒక భాగము (3) |
| 15) పాలు, వంతు, భాగ్యము, వాటా (3) |
| 16) కృప, కనికరము, ప్రేమ (2) |
| 17) బృహస్పతి భార్య, వాలి బార్య, నక్షత్రం (2) |
| 18) ఆకాశం, మేఘం (3) |
| 21) తంతు, స్వరాష్ట్రచింత, ఉపాయము, హేతువు, ధనం, పరివారము (3) |
| 24) మోక్షము, విడుపు (2) |
| 25) గాలి, హృదయమందలి గాలి, జీవము (3) |
| 27) పాదము, పద్యపాదము, చిహ్నము, ప్రయత్నము (2) |
| 28) ఆంగ్ల మీనింగ్, అనుస్వారం లేదు (2) |
| 29) గని, రత్నములు పుట్టు చోటు, నిధి (2) |
| 31) తరచు, బలము, గట్టియైన, స్థిరముగా, బలము, దార్ఢ్యము (3) |
| 32) ప్రమాదము, విపత్తు (2) |
నిలువు:
| 1) ఆస, తృష్ణ, కోరిక, దిక్కు (2) |
| 2) సిగబంతి, పూగమ్మ (3) |
| 3) చేయి, మిక్కిలి, అత్యంతము, తొండము, కిరణము, హస్తా నక్షత్రం (3) |
| 4) సత్యము, సత్యమైనది (2) |
| 7) రాగి, ఎర్రనిది (3) |
| 8) ఆశీర్వాదము (5) |
| 9) తోడికోడలు, పోవువాడు, బాటసారి (2) |
| 11) దినము, పగలు, నొప్పించునది (2) |
| 12) ఆభరణం, బంగారు లేక వెండి నాణెం (2) |
| 14) సంతోషము (3) |
| 15) వ్యాసుని పంచమవేదం (3) |
| 19) భయముతో కూడిన స్నేహము, శ్రద్ధ, సేవ, భాగము (2) |
| 20) తంత్రీ వాయిద్య విశేషము, విపంచి (2) |
| 22) సిగ్గు, కులట (2) |
| 23) 14 నిలువే, హర్షము (2) |
| 25) అడుగుట, ప్రార్థించుట, వేడుట, యాచన (3) |
| 26) వదనము, మొగము (3) |
| 28) అగ్రసోదరి (2) |
| 30) అగ్ని, మంట (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూలై 07వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 226 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 జూలై 12వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 224 జవాబులు:
అడ్డం:
1) నవరసు 3) అంగరక్ష 7) మోదం 8) శ్రీరంగం 9) శ్రోత 12) సారము 13) ఓటమి 17) తేజం 18) చలనం 19) మామా 22) సినీవాలి 23) అంతర్యామి
నిలువు:
1) నగుమోము 2) రక్తి 4) గమ్యం 5) క్షపితవ్యం 6) సారంగం 10) బేరము 11) కూటమి 14) అంతేవాసి 15) అలక 16) రమారమి 20) దావా 21) భ్రాత
సంచిక – పద ప్రతిభ 224 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె. ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రామలింగయ్య టి, తెనాలి
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంబర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

