Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-227

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) అరమర, సందేహము, బేధము (5)
5) నూరు వేలు (2)
6) వెనుక నుంచి ముందుకి – దీపపువర్తి, దశ (2)
8) రాముని గట్టిగా పిలవండి (2)
10) వెనుక నుంచి ముందుకి – జాలి, దయ (3)
12) అశ్వగతివిశేషము, మేఘము (2)
13) ఇంద్రుని కూతురు, ఒక సినీ నటి (3)
15) గొప్పతనం, వాత్సల్యం, ప్రేమ, ప్రియము, గారము (3)
16) మనోహరము, రమణీయం, సంపెంగచెట్టు, పొట్లవేరు (2)
17) వస్త్రభూషణాది ప్రయుక్తమైన కాంతి; ప్రభ, కాంతి; సౌందర్యము (2)
18) దిటము, మబ్బు, అభ్రకము, కాఠిన్యము (3)
21) రాగం బహువచనం (3)
24) వార్ధక్యము, వృద్ధత్వము, ముసలితనము (2)
25) తెలుపు, నిర్మలము, పరిశుభ్రత (3)
27) వెనుక నుంచి ముందుకు ప్రాణం, లింగపీఠము (2)
28) ప్రతి, మజ్జిగ, కొట్టు, పర్యాయము; తడవ (2)
29) వెనుక నుంచి ముందుకు – చెవితమ్మె, ఇంకు పెన్నుకు ముందు ఉండేది, సమూహము, సముదాయము (2)
31) ధనస్సు (3)
32) ఒక పుణ్యక్షేత్రం (2)

నిలువు:

1) తరంగం, ప్రసిద్ధిని తెలుపునది (2)
2) రక్షించుట, కాపు (3)
3) తమ్ముని భార్య (3)
4) జత, యుగళము, జోడు (2)
7) మిశ్రము, గుంపు, కడిమి చెట్టు (3)
8) మేఘము మీది మేఘము (5)
9) అదృశ్యం, మాయ, కృత్రిమం (2)
11) భయంకరమైనది, గొప్పది (2)
12) కింద నుంచి పైకి – ఆగమనం, విశ్రవసుని భార్య (2)
14) స్థిరము, నిశ్చితము, బోధపడినది, ఉనికిపట్టు (3)
15) భయము, కలవరము, తొందర (3)
19) ఆమడకు మీరి పారెడు ఏరు, ఏరు (2)
20) కోరిక (2)
22) గీతము, పాట, ధాన్యరూపంలో ఇచ్చే జీతం (2)
23) క్రింద నుంచి పైకి – క్షీరము, భాగము, వంతు (2)
25) వజ్రాయుధము, బాణము, యజ్ఞము (3)
26) భోజన పాత్ర, దేవునికి నివేదించు అన్నము (3)
28) విడుచు, మనోజ్ఞత, యోగ్యము (2)
30) చీలిక, ఖండము, భాగం, వరుస, విధము, చోటు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూలై 14తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 227 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 జూలై 19వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 225 జవాబులు:

అడ్డం:   

1) ప్రశ్నదూతి 2) లోభనము 7) యష్ట 8) ప్రకృతి 9) హ్మబ్ర 12) అంబరం 13) పోషణం 17) కజం 18) గృహము 19) శక్తి 22) ముకుళితం 23) కురుక్షేత్రం

నిలువు:

1) ప్రశ్రయము 2) దూర్వ 4) భక్తం 5) ముసాంబ్రము 6) సుకృతి 10) సంబరం 11) ధిషణ 14) నైకట్యము 15) సహనం 16) ముక్తిక్షేత్రం 20) కాళి 21) సౌరు

సంచిక – పద ప్రతిభ 225 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version