Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-228

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) చంద్రుడు (4)
3) గంగని ధరించినవాడిని గట్టిగ పిలవండి (4)
6) ఎట్టఎదుట, ఎదురెదురుగా (4)
9) మణిబంధము, మణికట్టు (4)
11) లయించినది, కరిగినది (3)
12) వెనుక నుంచి ముందుకి – భలేవాళ్ళు (4)
13) రక్షణగా, కాపాడేవాళ్ళలాగా (4)
14) తెల్లని చామరము, వింజామరము, వ్యవహారంలో మూడో అక్షరం లోపిస్తూంటుంది (3)
15) లోలోపల దహించుచు (4)
17) తడబడిన కానుకలు, మొక్కులు (4)
20) రెట్టింపు, ద్విగుణము, ఇమ్మడి (4)
21) మన్మథుడు, మేను లేని వాడు (4)

నిలువు:

1) తెలుపు, దోషము లేనిది, కేవలము (3)
2) బలిమి, తేజస్సు, నిప్పు (3)
4) గాయకురాలు (3)
5) ఇచ్చిన దానిని మరల దీర్చికొను, సేకరించు, వచ్చునట్లుచేయు (3)
7) ఖారీకము, పొలము (5)
8) చెడిపోవు, ఖిలమగు, నశించు (5)
9) ప్రేమ, అనురాగము, అభిమానము – రెండో అక్షరానికి ఉకారం చేరింది (5)
10) నారింజపండు, కిచ్చిలిపండు (5)
15) క్రింద నుంచి పైకి – విశాలంకానిది, స్థలాభావం (3)
16) క్రింద నుంచి పైకి – రత్నాలు (3)
18) ఇసుక తిన్నె, ఇసుక దిబ్బ, సైకతము (3)
19) బోయవాడు, లోభి, పిసినిగొట్టు (3)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూలై 21తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 228 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 జూలై 26వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 226 జవాబులు:

అడ్డం:   

1) ఆవశ్యకత 5) శతం 6) రథ్యం 8) ఆయా 10) సంఘము 12) నమ్ర 13) శాతము 15) భాగము 16) దయ 17) తార 18) నభము 21) తంత్రము 24) ముక్తి 25) ప్రాణము 27) పదం 28) అర్థ 29) ఖని 31) చిక్కన 32) ముప్పు

నిలువు:

1) ఆశ 2) వతంసం 3) కరము 4) తథ్యం 7) తామ్రము 8) ఆశాసనము 9) యాత 11) ఘస్రం 12) నగ 14) ముదము 15) భారతం 19) భక్తి 20) వీణ 22) త్రప 23) ముదం 25) ప్రార్థన 26) ముఖము 28) అక్క 30) నిప్పు

సంచిక – పద ప్రతిభ 226 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version