‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) పాలు, పెరుగు, తేనె, జలమును గలసిన దైవాభిషేక ద్రవ్యము (5) |
| 5) వివాహాదులలో చేయు కార్యవిశేషము, ఉత్సవము, తంత్రము, ఉపాయము (2) |
| 6) కార్యము, ఉద్యోగము, వ్యాపారము (2) |
| 8) యుద్ధము; అల్లిక మొదలు, ప్రసిద్ధిని తెలుపును (2) |
| 10) ఋక్షము, నక్షత్రము, రిక్క, ఎలుఁగుగొడ్డు (3) |
| 12) అక్క మొగుడు, మేనత్త/మేనమామ కొడుకు (2) |
| 13) లేశము, కోత, భిన్నాంకమునకు హారము (3) |
| 15) విషము, గడ్దిమోపు (3) |
| 16) స్తోత్రము, పొగడిక (2) |
| 17) సత్యభామ, స్త్రీ (2) |
| 18) పక్షి, విహంగము, పిట్ట, జాడ (3) |
| 21) కూతురు, ఆడబిడ్డ, కామధేనువు, గంగ (3) |
| 24) తోక త్రిప్పుట యందగు ధ్వన్యనుకరణము (2) |
| 25) రసయుక్తము, చౌక, (3) |
| 27) బ్రహ్మ; చేయుట; కాలము; భాగ్యము; అలంకార విశేషము (2) |
| 28) ఆడుది, కొమ్మ, పుట్ట చివర (2) |
| 29) ద్వేషము, విరోధము, శత్రుత్వము (2) |
| 31) దిటవు; మబ్బు; విరివి; సమ్మెట (3) |
| 32) ఆకు; దండు; అధికము; దట్టము (2) |
నిలువు:
| 1) పోటీ, ప్రతిజ్ఞ, పౌరుషం (2) |
| 2) స్త్రీ, నేర్పు, చతురత్వము (3) |
| 3) తపస్సు, వేసవికాలం, ఒక లోకము (3) |
| 4) ఋషి, బుద్ధదేవుడు, మౌన వ్రతము కలవాడు (2) |
| 7) తెలుపు, ఆబోతు, నిర్మలమైన (3) |
| 8) కుబేరుని పట్టణము (5) |
| 9) క్రింద నుంచి పైకి స్త్రీ, అడవి, వానప్రస్థుడు (2) |
| 11) ఓర్పు, సహనము, భూమి (2) |
| 12) వ్యామము, నాలుగు మూరలు, పొడుగు, పన్నెండు (2) |
| 14) మునకవేయు, నశించు, అడగు (3) |
| 15) పోక, ప్రయాణం, తలపు, పొందుట, (3) |
| 19) లోపము, కోత, వెలితి, అశ్వనీచగతి (2) |
| 20) పశ్వాదుల దీర్ఘముఖము, మోర, ఆర్తధ్వని (2) |
| 22) స్వర్గము (2) |
| 23) పాతర, నిక్షేపము, స్థానము, సముద్రము (2) |
| 25) సమానము, చదును (3) |
| 26) సంపత్తి, ఐశ్వర్యము, కలిమి (3) |
| 28) గోసమూహము, అడవి, కొన, మూల, కొండల యందలి మరుగుచోటు లోయ (2) |
| 30) కుత్తక, మెడ, గొంతు, రెల్లుగడ్డి, సజ్జరసము (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 జూలై 28వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 229 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఆగస్ట్ 02వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 227 జవాబులు:
అడ్డం:
1) అరమరిక 5) లక్ష 6) త్తివ 8) రామా 10) ణరుక 12) ముదం 13) జయంతి 15) గారాబం 16) రమ్యం 17) శోభ 18) ఘనము 21) రాగాలు 24) ముది 25) స్వచ్ఛత 27) నంపా 28) మారు 29) ళిపా 31) ధనువు 32) గయ
నిలువు:
1) అల 2) రక్షణ 3) రిత్తిక 4) కవ 7) కదంబం 8) రాజమేఘము 9) మాయం 11) రుద్రం 12) కరా 14) తిరము 15) గాభరా 19) నది 20) ఇచ్ఛ 22) గానం 23) లుపా 25) స్వరువు 26) తళిగ 28) మాను 30) పాయ
సంచిక – పద ప్రతిభ 227 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కోల్‌కతా.
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె. ఆదోని
- పి.వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

