‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) సంతోషము (4) |
| 3) శక్తి, తేజస్సు, శాంతి, మహాత్మ్యము, ప్రతాపము, పలుకుబడి (4) |
| 7) మార్గము (2) |
| 8) వదంతి, పుకారు (3) |
| 9) చివరి అక్షరం లోపించిన కాంతి, వెలుగు, సమానం (2) |
| 12) పేరు, కులము, గోత్రము (3) |
| 13) నైవేద్యం పెట్టినది, శాంతి, నిర్మలత్వం, ప్రసన్నత, అనుగ్రహం (3) |
| 17) ఉపాయము, కూడిక, న్యాయము (2) |
| 18) నిర్మలము, సంతుష్టము, ఊహ, దయగలది (3) |
| 19) చల్లపందిలి, చలివేంద్ర (2) |
| 22) అటు నుంచి – ప్రత్యక్షాది జ్ఞానకారణము, హేతువు (4) |
| 23) మొట్టమొదటిది, ముఖ్యము, పూర్వము (4) |
నిలువు:
| 1) చక్కగా విసరివేయుట, చేర్పబడినది, వ్యాపార సంఘములో ప్రతి భాగస్థుడు కట్టిన మూలధనము (4) |
| 2) కృప, జాలి, ప్రేమ (2) |
| 4) అభిప్రాయం, సత్తు, ఆత్మ, పుట్టుక (2) |
| 5) క్రింద నుంచి పైకి – విధము, భేదము, పోలిక (4) |
| 6) దేశాంతరగతుడు, ప్రోషితుడు, పరదేశయాత్ర చేయువాడు (3) |
| 10) చక్కగా మాట్లాడువాడు, సిద్ధపురుషుడు, దైవ దూత (3) |
| 11) వ్యాపనము, టి.వి., రేడియోల ద్వారా విషయాన్ని ప్రజలకు అందించటం (3) |
| 14) పదిలక్షలు, చక్కగా కూడినది (4) |
| 15) ప్రస్తావము, ప్రసంగము (3) |
| 16) ముంగాలు, మీగాలు, మునికాలు, పాదాగ్రము (4) |
| 20) రాముడిని గట్టిగా పిలవండి (2) |
| 21) ప్రఖ్యాతి, పేరు, ప్రసిద్ధి (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 ఆగస్ట్ 25వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 233 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 ఆగస్ట్ 30వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 231 జవాబులు:
అడ్డం:
1) రిక్కరక్కసుమిత్తి 5) వరదగుడి 6) రసజ్ఞత 7) అభ్యర్చన 9) పొత్తముముత్తో 10) శిశిరోపచారము
నిలువు:
2) క్కరదరు 3) రేవతీరమణుడు 4) అధిష్ఠానదేవత 8) లుముత్రప
సంచిక – పద ప్రతిభ 231 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె. ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- డా. వరలక్ష్మి హరావే, బెంగుళూరు
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

