‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) ప్రశస్తి పొందు (4) |
| 3) అతి త్వరగా (4) |
| 6) సంతోషంగా (4) |
| 9) గారము, ముద్దు, ప్రేమ – తడబడింది (4) |
| 11) చెల్లెలు, చివరి అక్షరం లోపించింది (3) |
| 12) శారికపక్షి (4) |
| 13) ఒక వైపు కత్తిగను, ఇంకొక వైపున గంటముగను ఉపయోగించు సాధనము (4) |
| 14) కుడి నుంచి ఎడమకు – స్నేహము, ఇష్టము; హెచ్చు వెలగలది (3) |
| 15) కుడి నుంచి ఎడమకు వచ్చి తడబడిన – సహాయపడు (4) |
| 17) తుత్తునాగము, ఒక ధాతువు (4) |
| 20) సముద్రం (4) |
| 21) రమారమి, దరిదాపు, సుమారు, దగ్గర దగ్గర, దాదాపు (4) |
నిలువు:
| 1) పరమాన్నం (3) |
| 2) కావలసినపని, అక్కఱ, హేతువు, వేడుక (3) |
| 4) క్రోధం, కినుక, అలుక, (3) |
| 5) కొడుకుని లేదా కుమారుని పిలుచుట (3) |
| 7) పరమేశ్వరుడు, పరమపురుషుడు (5) |
| 8) మాయతో, వంచనతో, మర్మముతో (5) |
| 9) 13వ మేళకర్త రాగం (5) |
| 10) కస్తూరీ (5) |
| 15) క్రింద నుంచి పైకి – జెట్టి, శ్రేష్ఠుడు, ఉస్తాదు (3) |
| 16) వైవర్ణ్యము, తెల్లన, డాలు (3) |
| 18) పవళించు, నిద్రించు (3) |
| 19) పూర్తి చేయు, ఖండించు, చాలించు (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 01వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 234 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 సెప్టెంబర్ 06వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 232 జవాబులు:
అడ్డం:
1) ఉభయతారకంగా 5) నిరుపయోగం 6) కరణీయం 7) ముడుపులు 9) బ్రహ్మముడులు 10) ఊషరబీజన్యాయం
నిలువు:
2) తాళపత్రం 3) ఆకస్మిక తనిఖీ 4) ఎండచాలుపుట్టువు 8) లుమురబీ
సంచిక – పద ప్రతిభ 232 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కోల్‌కతా
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మంజులదత్త కె. ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- విన్నకోట ఫణీంద్ర, హైదరాబాదు
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

