Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక – పద ప్రతిభ-235

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).

ఆధారాలు:

అడ్డం:

1) క్షేమంకరుడు, మేలు చేయువాడు (5)
5) ఒకానొక చెట్టుబంక, జతువు, లాక్ష (2)
6) నాడి, రామకర్పూరము (2)
8) ఆసనము, పీట (2)
10) కుడి నుంచి ఎడమకు – ఋషులు (3)
12) మామ, శ్వశురుడు (2)
13) చిక్కు, పట్టు, తాకు, అంటు, పొసగు (3)
15) జాగు, విలంబము – చివరి అక్షరం ‘శ్యం’ రాయండి (3)
16) సేవింపదగినది (2)
17) ఒక గోపిక; కర్ణుని పెంపుడుతల్లి; విశాఖానక్షత్రము; మెఱపు; ఉసిరిక; విష్ణుక్రాంత (2)
18) త్వరగా, త్వరితంగా (3)
21) ఇంగిలీకము, హింగులువు (3)
24) కుడి నుంచి ఎడమకు – పోలిక, సాపత్యం (2)
25) పెల్లు, అధికము (3)
27) ఉత్కోచము (2)
28) జీవించు, ఒప్పు, వర్తించు, పెరుగు (2)
29)  సిగ్గు, లజ్జ (2)
31) ప్రతిన, శపథము (3)
32) సంతోషము (2)

నిలువు:

1) కెరటము, లహరి (2)
2) నక్షత్రములు (3)
3) స్థానము (3)
4) స్థిరము (2)
7) నిశ్చయముగ, నెట్టన, (3)
8) కుంకుమపువ్వు, ఇత్తడి (5)
9) గంట మొదలగునది మ్రోఁగుటయం దగు ననుకరణము (2)
11) స్తోత్రము, పొగడిక (2)
12) పూదండ, కంఠాభరణం, వరుస (2)
14) స్త్రీలు చేతులకు ధరించేవి, మట్టితోనూ, బంగారం తోనూ చేస్తారు – క్రింద నుంచి పైకి వచ్చాయి (3)
15) ఆదరువు, ఆసరా (3)
19) బొంత, పోవువాడు, పొందువాడు (2)
20) ఎల్లప్పుడు, ఎడతెగని (2)
22) నీళ్లు, ఉదకము (2)
23) భోజన పాత్రము, పళ్ళెము (2)
25) సమ్మతి, అంగీకారం           (3)
26) ఉపాయము, సిద్ధాంతము, హేతువు (3)
28) బుద్ధి, తలంపు, ఇచ్ఛ (2)
30) పాదము, పద్యపాదము, చిహ్నము, శబ్దము, ప్రయత్నం, పాట, వాక్యం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 08వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 235 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 సెప్టెంబర్ 13వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ 233 జవాబులు:

అడ్డం:   

1) ప్రమోదము 3) ప్రభావము 7) పథం 8) ప్రవాదం 9) ప్రకా 12) ప్రవర 13) ప్రసాదం 17) యుక్తి 18) ప్రసన్నం 19) ప్రప 22) ముణమాప్ర 23) ప్రథమము

నిలువు:

1) ప్రక్షేపము 2) దయ 4) భావం 5) మురకాప్ర 6) ప్రవాసి 10) ప్రవక్త 11) ప్రసారం 14) ప్రయుతము 15) ప్రసక్తి 16) ప్రపదము 20) రామా 21) ప్రథ

సంచిక – పద ప్రతిభ 233 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version