‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).
ఆధారాలు:
అడ్డం:
| 1) క్షేమంకరుడు, మేలు చేయువాడు (5) |
| 5) ఒకానొక చెట్టుబంక, జతువు, లాక్ష (2) |
| 6) నాడి, రామకర్పూరము (2) |
| 8) ఆసనము, పీట (2) |
| 10) కుడి నుంచి ఎడమకు – ఋషులు (3) |
| 12) మామ, శ్వశురుడు (2) |
| 13) చిక్కు, పట్టు, తాకు, అంటు, పొసగు (3) |
| 15) జాగు, విలంబము – చివరి అక్షరం ‘శ్యం’ రాయండి (3) |
| 16) సేవింపదగినది (2) |
| 17) ఒక గోపిక; కర్ణుని పెంపుడుతల్లి; విశాఖానక్షత్రము; మెఱపు; ఉసిరిక; విష్ణుక్రాంత (2) |
| 18) త్వరగా, త్వరితంగా (3) |
| 21) ఇంగిలీకము, హింగులువు (3) |
| 24) కుడి నుంచి ఎడమకు – పోలిక, సాపత్యం (2) |
| 25) పెల్లు, అధికము (3) |
| 27) ఉత్కోచము (2) |
| 28) జీవించు, ఒప్పు, వర్తించు, పెరుగు (2) |
| 29) సిగ్గు, లజ్జ (2) |
| 31) ప్రతిన, శపథము (3) |
| 32) సంతోషము (2) |
నిలువు:
| 1) కెరటము, లహరి (2) |
| 2) నక్షత్రములు (3) |
| 3) స్థానము (3) |
| 4) స్థిరము (2) |
| 7) నిశ్చయముగ, నెట్టన, (3) |
| 8) కుంకుమపువ్వు, ఇత్తడి (5) |
| 9) గంట మొదలగునది మ్రోఁగుటయం దగు ననుకరణము (2) |
| 11) స్తోత్రము, పొగడిక (2) |
| 12) పూదండ, కంఠాభరణం, వరుస (2) |
| 14) స్త్రీలు చేతులకు ధరించేవి, మట్టితోనూ, బంగారం తోనూ చేస్తారు – క్రింద నుంచి పైకి వచ్చాయి (3) |
| 15) ఆదరువు, ఆసరా (3) |
| 19) బొంత, పోవువాడు, పొందువాడు (2) |
| 20) ఎల్లప్పుడు, ఎడతెగని (2) |
| 22) నీళ్లు, ఉదకము (2) |
| 23) భోజన పాత్రము, పళ్ళెము (2) |
| 25) సమ్మతి, అంగీకారం (3) |
| 26) ఉపాయము, సిద్ధాంతము, హేతువు (3) |
| 28) బుద్ధి, తలంపు, ఇచ్ఛ (2) |
| 30) పాదము, పద్యపాదము, చిహ్నము, శబ్దము, ప్రయత్నం, పాట, వాక్యం (2) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 08వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక – పద ప్రతిభ 235 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 సెప్టెంబర్ 13వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 233 జవాబులు:
అడ్డం:
1) ప్రమోదము 3) ప్రభావము 7) పథం 8) ప్రవాదం 9) ప్రకా 12) ప్రవర 13) ప్రసాదం 17) యుక్తి 18) ప్రసన్నం 19) ప్రప 22) ముణమాప్ర 23) ప్రథమము
నిలువు:
1) ప్రక్షేపము 2) దయ 4) భావం 5) మురకాప్ర 6) ప్రవాసి 10) ప్రవక్త 11) ప్రసారం 14) ప్రయుతము 15) ప్రసక్తి 16) ప్రపదము 20) రామా 21) ప్రథ
సంచిక – పద ప్రతిభ 233 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కోల్‌కతా
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె. ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- డా. వరలక్ష్మి హరావే, బెంగుళూరు
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

