‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).
ఆధారాలు:
అడ్డం:
| 1) పాడి ఆవు, ధేనువు, ఆడమేక, ఏరు (4) |
| 3) పారంపరాగత క్రమము, వంశాచారంగా వచ్చిన, సంప్రదాయ సిద్ధమైన (4) |
| 5) శుక్తి, ముత్తెపుచిప్ప (4) |
| 6) గంధకము (4) |
| 7) మహా వైభవం, ఎక్కువ భోగము (4) |
| 9) ఇచ్చకము, మోమాటము (4) |
| 11) ఆముదపు చెట్టు (4) |
| 12) “తెట్టలాయ మహిమలే ____ కొండ” అన్నాడు అన్నమయ్య (4) |
నిలువు:
| 1) స్థైర్యము, దృఢము (4) |
| 2) అడ్డు లేనిది, చెదరనిది, అపరిమితము, హద్దు లేనిది (4) |
| 3) సంపూర్ణము (4) |
| 4) సిబ్బంది, పరివారం, పనులు నిర్వహించే వ్యవస్థ (4) |
| 7) హరివిల్లు, ఇంద్రధనుస్సు (4) |
| 8) గంగానది నీరు (4) |
| 9) నారదుడు (4) |
| 10) ఉసిరిక చెట్టు (4) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 15వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 236 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 సెప్టెంబర్ 20వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 234 జవాబులు:
అడ్డం:
1) పాటికెక్కు 3) టాకోటాకు 6) సంతసంగా 9) గాముబరా 11) యవీయ 12) గోరువంక 13) కత్తిగంటం 14) ముయప్రి 15) డుడుపతో 17) యశదము 20) మహాకచ్ఛం 21) ఇంచుమించు
నిలువు:
1) పాయసం 2) కెలసం 4) కోపము 5) కుమారా 7) తత్పురుషుడు 8) గాయకముతో 9) గాయకప్రియ 10) బహుగంధద 15) డుల్లుమ 16) పలుక 18) శయించు 19) ముగించు
సంచిక – పద ప్రతిభ 234 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహనరావు, ఖమ్మం
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మంజులదత్త కె. ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- డా. వరలక్ష్మి హరావే, బెంగుళూరు
- జాకీర్ హుస్సేన్. ఎమ్.ఎమ్.డి, ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

