‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. (Grid 9 x 9).
ఆధారాలు:
అడ్డం:
| 1) చంద్రునికి సమర్పించేది, ఓ సామెత, సంచికలో సలీం గారి ధారావాహిక (9) |
| 5) అటునుంచి – రహస్యంగా మాట్లాడు (9) |
| 6) చేయి, ఏనుగు తొండం, (2) |
| 7) పరువు తోడిది (3) |
| 8) కుడి నుంచి ఎడమకి – సమూహము, మంద, (2) |
| 11) చెదిరిన రంగులు (3) |
| 12) పొలిమేర వెంబడి ఉన్న పొలము (5) |
| 13) బంధువు ఉంటే.. మళ్ళీ వేరే మంటెందుకు అనే అర్థం లోని సామెత (8) |
నిలువు:
| 1) రేరాజు లేకుండా నెలవెలుగు ఉందా అనే అర్థంలోని సామెత (9) |
| 2) ప్రభువు, అధికారి – అక్షరాలు తడబడ్డాయి (4) |
| 3) కాంతులు, జ్యోతులు – అక్షరాలు తడబడ్డాయి (4) |
| 4) చిన్నపిల్లలు రెండు చేతులు మూసి, గుప్పిళ్ళుగా ఆడే ఒక ఆట (8) |
| 9) బంగాళాదుంప – తడబడింది (4) |
| 10) మిత వ్యయంగా, సుకుమారంగా – అక్షరాలు తడబడ్డాయి (4) |
| 12) చూపుడువ్రేలు, ప్రదేశిని (3) |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 29వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 238 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2026 అక్టోబర్ 04వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
సంచిక – పద ప్రతిభ 236 జవాబులు:
అడ్డం:
1) పయస్విని 3) సాంప్రదాయం 5) ముక్తాస్ఫోటం 6) గంధాశ్మము 7) ఇంద్రభోగం 9) ముఖప్రీతి 11) పంచాంగులం 12) తిరుమల
నిలువు:
1) పదిలము 2) నిరాఘాటం 3) సాంగోపాంగం 4) యంత్రాంగము 7) ఇంద్రచాపం 8) గంగాజలం 9) ముళ్ళయతి 10) తిష్యఫల
సంచిక – పద ప్రతిభ 236 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- పి. వి. రాజు, హైదరాబాద్
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- డా. వరలక్ష్మి హరావే, బెంగుళూరు
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 9390483725 అనే నెంబరులో (ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
సాహిత్యాభిమానులందరికి వందనములు. నా పేరు పెయ్యేటి సీతామహాలక్ష్మి. ప్రస్తుతం తిరుపతిలో నివాసం. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. వాటితోపాటు తెలుగులో పదరంగాలు/పదప్రహేళికలు లాంటివి పూరించడమంటే ఇంకా ఇష్టం. చాల సార్లు నగదు బహుమతులు కూడా లభించాయి. మొదటిసారిగా నేను కూడా ఒక పజిల్ స్వంతంగా రాసి పంపితే శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్ గారు మెచ్చుకుని తన “పదచదరంగాలు” అనే పుస్తకం (తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్ సంకలనం) ప్రచురించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అందుకు వారికి చాల కృతజ్ఞురాలిని. ఇటీవల “తెలుగు సొగసు” అంతర్జాల పత్రికలో కూడా నా పజిల్స్ “పదకేళి” అనే పేరుతో ప్రచురింపబడుతున్నాయి. ఇందుకు శ్రీ దాసరి చంద్ర గారికి కూడా ధన్యవాదములు. సంచిక అంతర్జాల పత్రికలో కూడా నేను సమకూర్చిన గళ్ళనుడికట్టులను (క్రాస్‌వర్డ్ పజిల్స్) ప్రచురిస్తున్నారు. పజిల్స్ అభిమానులందరికి ఇవి ఆనందాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాను.

